20 ఏళ్ళ క్రితం విడుదలైన మూవీతో మేనల్లుడు నాగ చైతన్య షాకిచ్చిన వెంకటేష్.. ఇదేం క్రేజ్ బాబోయ్

Published : Aug 29, 2025, 08:59 PM IST

తాజాగా వెంకటేష్ నటించిన 20 ఏళ్ళ క్రితం సినిమా వార్తల్లో నిలిచింది. 2005లో వెంకటేష్, శ్రీకాంత్ కలిసి సంక్రాంతి అనే చిత్రంలో నటించారు.

PREV
15

విక్టరీ వెంకటేష్ కి ఫ్యామిలీ ఆడియన్స్ లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వెంకటేష్ కి కనుక పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ పడితే రికార్డులు బద్దలవుతాయి. ఆ విషయం సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో మరోసారి రుజువైంది. ఈ మూవీ ఏకంగా 300 కోట్ల వరకు గ్రాస్ రాబట్టింది. 

25

తాజాగా వెంకటేష్ నటించిన 20 ఏళ్ళ క్రితం సినిమా వార్తల్లో నిలిచింది. 2005లో వెంకటేష్, శ్రీకాంత్ కలిసి సంక్రాంతి అనే చిత్రంలో నటించారు. ఈ మూవీలో స్నేహ, ఆర్తి అగర్వాల్, సంగీత హీరోయిన్లుగా నటించారు. అప్పట్లో ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ఫ్యామిలీ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. 

35

20 ఏళ్ళ క్రితం సినిమా కాబట్టి ఇప్పటికి కొన్ని వందల సార్లు టీవీలో ఈ చిత్రం ప్రసారం అయి ఉంటుంది. గత వారం ఈ చిత్రాన్ని జెమిని టివిలో ప్రదర్శించారు. కానీ ఇప్పటికీ ఈ చిత్రం రికార్డ్ స్థాయిలో టీఆర్పీ రేటింగ్ రాబడుతోంది అంటే ఈ చిత్ర క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. 

45

ఈ చిత్రం గత వారం ఏకంగా 6.08 రేటింగ్ సాధించింది. అదే సమయంలో ప్రసారమైన నాగ చైతన్య తండేల్ చిత్రానికి షాక్ తప్పలేదు. తండేల్ ని వెనక్కి నెట్టి మరీ సంక్రాంతి టాప్ లో నిలిచింది. తండేల్ చిత్రానికి 5.08 రేటింగ్ నమోదు కాగా, సిద్దు జొన్నలగడ్డ జాక్ చిత్రానికి 4.45 రేటింగ్ లభించింది. 

55

నగరాల్లో తండేల్ కి మంచి రేటింగ్ లభించగా.. గ్రామాల్లో, పట్టణాల్లో మాత్రం సంక్రాంతి చిత్రానికి అద్భుతమైన ఆదరణ లభిస్తోంది. మొత్తంగా వెంకీ మామ మేనల్లుడు నాగ చైతన్యకి ఊహించని షాక్ ఇచ్చాడు. 

Read more Photos on
click me!

Recommended Stories