గర్భవతి కావడం ఇష్టం లేక సన్నీలియోన్ ఏం చేసిందో తెలుసా.. అలా చేయడం చాలా కాస్ట్లీ అంటూ కామెంట్స్

Published : Aug 29, 2025, 08:04 PM IST

సన్నీ లియోన్ సరోగసి ద్వారా పిల్లలని పొందారు. ఎందుకు సరోగసి ఎంచుకోవాల్సి వచ్చింది అనే విషయాన్ని సన్నీ లియోన్ ఓ ఇంటర్వ్యూలో చేసింది. 

PREV
15

బాలీవుడ్ నటి సన్నీ లియోన్ సరోగసి ద్వారా పిల్లలని పొందడం గురించి ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. బోల్డ్ గా నటించిన సన్నీ లియోన్ బాలీవుడ్ లో కొన్ని చిత్రాల్లో మెరిసింది. తెలుగు లో ఆమె కరెంట్ తీగ, జిన్నా లాంటి చిత్రాల్లో నటించారు. గరుడ వేగ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసింది.

25

సన్నీ లియోన్ ఓ పాపని దత్తత తీసుకుంది. ఆ తర్వాత సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు ఆమె తల్లి అయ్యారు. తనకు గర్భవతిని అయి పిల్లలని కనడం ఇష్టం లేకనే సరోగసి ఎంచుకున్నట్లు సన్నీలియోన్ తెలిపింది. అయితే గతంలో గర్భం కోసం ప్రయత్నించానని సన్నీలియోన్ పేర్కొంది. నా ఆరోగ్యం సహకరించలేదు. ఐవీఎఫ్ వెళితే పలుమార్లు ఫెయిల్ అయ్యాను. 

35

అందుకే గర్భం దాల్చి పిల్లలని కనడం వద్దనుకున్నట్లు సన్నీలియోన్ పేర్కొంది. సరోగసి కోసం తాను తన భర్త చాలా ఖర్చు చేసినట్లు సన్నీలియోన్ పేర్కొంది. లీగల్ గా అన్ని అనుమతులు తీసుకున్నాం. సరోగసికి ఒప్పుకున్న మహిళకు చాలా డబ్బు ఇచ్చాం. ఆమె భర్తకి కూడా ప్రతీ వారం డబ్బులు ఇవ్వాల్సి వచ్చేది. ఇతర ఖర్చులు కూడా భరించాం. మేము ఇచ్చిన డబ్బుతో ఆమె అందమైన ఇల్లుని నిర్మించుకుంది. అంతే కాదు మరోసారి ఘనంగా పెళ్లి చేసుకుంది అని సన్నీలియోన్ పేర్కొంది. 

45

సన్నీలియోన్ 2011లో డానియల్ వెబర్ ని వివాహం చేసుకుంది. 2017లో వీరు నిషా అనే పాపని దత్తత తీసుకున్నారు. ఐవిఎఫ్ ఫెయిల్ అయ్యాక దత్తత కోసం అప్లికేషన్ పెట్టుకున్నారట. 

55

దత్తత ద్వారా బిడ్డని పొందాక సరోగసికి వెళ్లారు. జిస్మ్ 2 చిత్రంతో సన్నీలియోన్ బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. తక్కువ సమయంలోనే సన్నీలియోన్ కి క్రేజీ నటిగా గుర్తింపు దక్కింది. 

Read more Photos on
click me!

Recommended Stories