వరుసకి చెల్లి, కానీ ఆ హీరోయిన్‌తో తెరపై రొమాన్స్ చేసిన వెంకటేష్‌.. ఎవరా నటి?

First Published | Oct 19, 2024, 4:47 PM IST

వెంకటేష్‌ తన కెరీర్‌లో ఎంతో మంది హీరోయిన్లతో వర్క్ చేశాడు. ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్ తో ఇరగదీశాడు. కానీ ఆయన వరుసకి చెల్లి అయ్యే హీరోయిన్‌తోనూ రొమాన్స్ చేయడం హైలైట్‌గా నిలిచింది. 
 

Daggubati Venkatesh

విక్టరీ వెంకటేష్‌.. టాలీవుడ్‌లో వివాదరహితుడిగా ఉన్నాడు. ఆయన తన సినిమాలు, తన ఫ్యామిలీ, తన ఆథ్యాత్మిక చింతనతో ఉంటారు. మిగిలిన ఏ విషయాలను పట్టించుకోరు. బయట సినిమా ఈవెంట్లలోనూ కనిపించేది తక్కువే. చాలా అరుదుగా గెస్ట్ గా వస్తూ సందడి చేస్తుంటారు. టాలీవుడ్‌లో ఫ్యామిలీ ఆడియెన్స్ కి బాగా దగ్గరైన హీరోగా పేరుతెచ్చుకున్నారు వెంకీ. మంచి ఫ్యామిలీ సెంటిమెంట్స్ కి, ఎమోషన్స్ కి ఆయన పెట్టింది పేరు. ఇన్నోసెంట్‌ రోల్స్ లో వెంకీ నటన వేరే లెవల్‌. అదే సమయంలో కామెడీని పంచడంలోనూ ఆయన మరో లెవల్. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 ఇంట్రస్టింగ్‌ అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

Venkatesh Daggubati

తన కెరీర్‌లో వెంకీ చేసింది  ఫ్యామిలీ ఎంటర్‌టైనర్సే ఎక్కువ కావడం విశేషం. వీటితోపాటు ఎన్నో లవ్‌ స్టోరీస్‌ చేశారు. `ప్రేమించుకుందాం రా`, `ప్రేమంటే ఇదేరా`, `ప్రేమ`, `కలిసుందాం రా`, `రాజా`, `మల్లీశ్వరి`, `నువ్వు నాకు నచ్చావ్‌` వంటి సినిమాలు అటు లవ్‌ స్టోరీ విషయంలోనూ, ఇటు ఫ్యామిలీ ఎలిమెంట్ల పరంగానూ సమపాళ్లతో ఉంటూ అలరించాయి. టాలీవుడ్‌ని ఊపేశాయి. ఇటీవల సరైన సక్సెస్‌ లేని వెంకటేష్‌ మంచి హిట్‌ కోసం వెయిట్‌ చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. 


ఇదిలా ఉంటే వెంకీ తన నాలుగు దశాబ్దాల కెరీర్‌లో 75 సినిమాలు చేశారు. ఎంతో మంది హీరోయిన్లతో పనిచేశారు. సౌందర్య, సిమ్రాన్‌, ఖుష్బూ, మీనా, భాను ప్రియా వంటి వారితో ఎక్కువ సినిమాలు చేశారు. అయితే ఆయన తనకు వరుసకి చెల్లి అయ్యే హీరోయిన్‌తోనూ వెండితెరపై రొమాన్స్ చేయడం విశేషం. మరి ఆ హీరోయిన్‌ ఎవరు? ఆమెతో వెంకీ చేసిన సినిమాలేంటి? అవి హిట్టా? ఫట్టా? అనేది చూస్తే. 
 

వెంకటేష్‌కి నాగార్జున బావ అనే విషయం తెలిసిందే. తన చెల్లి లక్ష్మిని మొదట నాగ్‌కి ఇచ్చి పెళ్లి చేశారు. వీరికి నాగచైతన్య జన్మించారు. కానీ ఆ తర్వాత ఈ ఇద్దరు విడాకులు తీసుకున్నారు. లక్ష్మికి సినిమాలంటే ఇష్టం లేక విడిపోయినట్టు సమాచారం. ఆ తర్వాత ఆమె మరో పెళ్లి చేసుకుంది. ఇక నాగార్జున కొంత కాలం తర్వాత హీరోయిన్‌ అమలతో ప్రేమలో పడ్డాడు. ఎట్టకేలకు ఆమెనే పెళ్లి చేసుకున్నారు. వీరికి అఖిల్‌ జన్మించారు. అయితే పెళ్లికి ముందు అమల చాలా మంది హీరోలతో పని చేసింది. నాగార్జునతోపాటు చిరంజీవి, రాజశేఖర్‌, కమల్‌ హాసన్‌, రజనీకాంత్‌ వంటి వారితోనూ వర్క్ చేసింది. అందులో భాగంగా వెంకటేష్‌ తోనూ సినిమాలు చేయడం విశేషం.   
 

పెళ్లికి ముందు వెంకటేష్‌ ఒక హీరోగానే తెలుసు. కానీ పెళ్లైయ్యాకనే ఆయన తనకు వరుసకి సోదరుడు అయ్యాడు. నాగార్జునని పెళ్లి చేసుకున్న నేపథ్యంలో వెంకటేష్‌ అన్న అయిపోయాడు. ఇలా ఈ బంధం తెలియని క్రమంలో ఈ ఇద్దరు కలిసి రెండు సినిమాల్లో నటించారు. వెండితెరపై రొమాన్స్ చేశారు. మొదటగా ఈ ఇద్దరు 1988లో కలిసి `రక్త తిలకం` అనే సినిమాలో నటించారు. వెంకటేష్‌కి జోడీగా అమల నటించడం విశేషం. ఈ యాక్షన్‌ ఫిల్మ్ కి బి గోపాల్‌ దర్శకుడు. ఇందులో వెంకీ, అమల కలిసి ఆడిపాడారు. తమదైన రొమాన్స్ తో ఆద్యంతం ఆకట్టుకున్నారు. ఈ సినిమా పెద్ద హిట్‌ అయ్యింది. మాస్‌ ఆడియెన్స్ ని, ఫ్యామిలీ ఆడియెన్స్ ని బాగా ఆకట్టుకుంది. 
 

ఆ తర్వాత రెండేళ్లకి `అగ్గిరాముడు` సినిమాలో జంటగా నటించారు. ఎస్‌ ఎస్‌ రవిచంద్ర దర్శకత్వం వహించిన చిత్రమిది. ఇందులో వెంకీ ద్విపాత్రాభినయం చేశారు. గౌతమి, అమల హీరోయిన్లుగా నటించి మెప్పించారు. ఇలా మరోసారి వెంకీతో రొమాన్స్ చేసింది అమల. ఈ సినిమా దారుణంగా డిజాస్టర్‌ అయ్యింది. మళ్లీ ఈ ఇద్దరు కలిసి నటించలేదు. అప్పటికే నాగార్జునతో ప్రేమలో మునిగి తేలుతుంది అమల. దీంతో వెంకీతో సినిమాలకు దూరంగా ఉంది. ఇంకా చెప్పాలంటే కొత్త సినిమాలు ఒప్పుకోవడం కూడా తగ్గించింది. నాగ్‌ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో సినిమాలకు ఫుల్‌ స్టాప్‌ పెట్టింది అమల. 
 

అమల తమిళంలో ఎక్కువగా సినిమాలు చేసింది. దీంతోపాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళంలోనూ సినిమాలు చేసింది. అయితే తెలుగులో మాత్రం మొదటగా ఆమె నాగార్జునతోనే `కిరాయి దాదా` సినిమాలో నటించింది. ఈ సినిమా సమయం నుంచే ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. వరుసగా `చిన్నబాబు`, `శివ`, `ప్రేమ యుద్ధం`, `ఆగ్రహం` వంటి   సినిమాలు కలిసి చేయడంతో ఆ స్నేహం ప్రేమగా బలపడింది. ఆ వెంటనే 1992లో వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత సినిమాలు మానేసింది అమల. మధ్యలో ఒకటి అర బలమైన పాత్రల్లో మెరుస్తుంది. ఇటీవల ఆమె `ఒకే ఒక జీవితం`లో శర్వానంద్‌కి అమ్మ పాత్రలో నటించి మెప్పించింది. 

read more: అల్లు అర్జున్‌ కాదు, పవన్‌ రావడం లేదు, `అన్‌స్టాపబుల్‌` 4 ఫస్ట్ ఎపిసోడ్‌ ఆయనతోనే.. బాలయ్య వేరే లెవల్‌ ప్లాన్‌

Also read: రామ్‌ చరణ్‌ స్టేజ్‌పై ఫస్ట్ స్పీచ్‌, ఏం మాట్లాడాడో తెలుసా? కొడుకు మాటలకు చిరంజీవి ఎమోషనల్‌
 

Latest Videos

click me!