7వ వారానికి గాను తొమ్మిది మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. నబీల్, నాగ మణికంఠ, ప్రేరణ, పృథ్వి, టేస్టీ తేజ, హరితేజ, గౌతమ్, నిఖిల్, యష్మి నామినేషన్స్ లిస్ట్ లో ఉన్నారు. శుక్రవారం అర్ధరాత్రి ఓటింగ్ లైన్స్ ఓపెన్ క్లోజ్ అయ్యాయి. ఓటింగ్ ముగిసింది. ఈ క్రమంలో ఎవరు ఎలిమినేట్ అవవుతారనే ఉత్కంఠ నెలకొంది.
తాజా ఓటింగ్ సరళి పరిశీలిస్తే ఇద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ రేసులో వెనుకబడ్డారట. సోషల్ మీడియా స్టార్ నబీల్ అనూహ్యంగా టాప్ లో ట్రెండ్ అవుతున్నాడట. అతడికి అత్యధికంగా ఓట్లు పోల్ అయ్యాయట. నబీల్ కి దాదాపు 21 శాతానికి పైగా ఓట్లు పోల్ అయ్యాయట. చెప్పాలంటే నబీల్ కి పెద్దగా పాపులారిటీ లేదు. కేవలం గేమ్ ఆధారంగా అతడు ఓట్లు సంపాదిస్తున్నట్లు తెలుస్తుంది.