బాహుబలి 1 ఫ్లాప్ అని ఫిక్స్ అయిపోయా, గుండెపోటు వచ్చినంత పనైంది..ఆ రోజు రాత్రి ప్రభాస్ ఏం చేశాడంటే

First Published | Oct 19, 2024, 4:26 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈశ్వర్ చిత్రంతో కెరీర్ ప్రారంభించి బాహుబలితో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ చక్రవర్తిగా వెలుగొందుతున్నాడు. ప్రభాస్ రీసెంట్ ఫిలిం కల్కి 2898 ఎడి 1100 కోట్లు వసూళ్లు సాధించి చరిత్ర సృష్టించింది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈశ్వర్ చిత్రంతో కెరీర్ ప్రారంభించి బాహుబలితో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ చక్రవర్తిగా వెలుగొందుతున్నాడు. ప్రభాస్ రీసెంట్ ఫిలిం కల్కి 2898 ఎడి 1100 కోట్లు వసూళ్లు సాధించి చరిత్ర సృష్టించింది. ప్రభాస్ ఇంతలా పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్నాడు అంటే అందుకు కారణం బాహుబలి చిత్రమే అని చెప్పొచ్చు. 

అయితే బాహుబలి చిత్ర విశేషాలని ప్రభాస్ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. బాహుబలి 1 రిలీజ్ అయినప్పుడు తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా నెగిటివ్ టాక్ వచ్చింది. అదంతా సెకండ్ డే నుంచి సెట్ అయింది అనే సంగతి అందరికి తెలిసిన విషయమే. తెలుగులో అలాంటి సాహసం చేయడం.. అంత బడ్జెట్ పెట్టడం, పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయడం అదే ఫస్ట్ టైం. 


అలాంటి చిత్రానికి నెగిటివ్ టాక్ వచ్చినప్పుడు ప్రభాస్ మానసిక స్థితి ఏంటి ? అసలు రిలీజ్ డే రోజు నైట్ ప్రభాస్ ఏం చేసాడు ? లాంటి విషయాల్ని ప్రభాస్ స్వయంగా రివీల్ చేశాడు. నా ప్రతి చిత్రం రిలీజ్ కి ముందు నాకు టెన్షన్ ఉంటుంది. టెన్షన్ ఉండదు అని అబద్దం చెప్పలేను. కచ్చితంగా టెన్షన్ ఫీల్ అవుతా. రిలీజ్ కి ముందు రోజు చాలా మంది ఫోన్స్ చేస్తుంటారు. బాహుబలి కి ముందు నా ఫ్రెండ్స్ యువి క్రియేషన్స్ వాళ్లతో మిర్చి మూవీ చేశా. అది సూపర్ హిట్ అయింది. 

ఆ ఫస్ట్ టైం నా ఫ్రెండ్స్ తో చేసిన మూవీ కాబట్టి టెన్షన్ గా ఉండింది. చాలా మంది ఫోన్స్ చేస్తున్నారు. నేను నిద్ర పోతున్న సినిమా బ్లాక్ బస్టర్ అయితేనే ఫోన్ చేసి లేపండి.. సినిమా ఫ్లాప్ అయితే ఎవ్వరూ ఫోన్ చేయొద్దు అని చెప్పా. వాళ్లకి నిద్ర పోతాను అని చెప్పను కానీ నేను నిద్ర పోను. టెన్షన్ తో నిద్ర రాదు. మిర్చి చిత్రానికి ఎర్లీ మార్నింగ్ కాల్ చేశారు. ఎస్ మనం కొట్టేశాం.. సినిమా సూపర్ హిట్ అని చెప్పారు. 

బాహుబలి 1 రిలీజ్ అప్పుడు నా ఫ్రెండ్స్ కి అదే విషయం చెప్పా. బ్లాక్ బస్టర్ అయితేనే నిద్ర లేపండి అని చెప్పా. కానీ మార్నింగ్ ఎవరూ కాల్ చేయలేదు. అదేంటి అనుకుని నేను ఫోన్ చేసి టాక్ అడుగుతుంటే నా ఫ్రెండ్స్ నీళ్లు నములుతున్నారు. నాకు అర్థం అయిపోయింది, హార్ట్ అటాక్ వచ్చినంత పనైంది.. బాబోయ్ నా సినిమా పోయింది బాహుబలి 1 ఫ్లాప్ అని ఫిక్స్ అయిపోయా. ఆ తర్వాత కంప్లీట్ గా టాక్ గురించి తెలుసుకున్నా. తెలుగులో తప్ప మిగిలిన భాషల్లో అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. కానీ తెలుగులో మాత్రం బ్యాడ్ టాక్. దానికి కారణం రాజమౌళి, నా కాంబినేషన్ లో చిత్రం కాబట్టి విపరీతంగా అంచనాలు పెట్టుకున్నారు. 

దానికి తోడు చివర్లో కట్టప్ప వచ్చి బాహుబలిని చంపేస్తాడు అని చూపించడం, ఉన్నపళంగా ఆ ట్విస్ట్ తో సినిమా ఎండ్ కావడంతో ఆడియన్స్ జీర్ణించుకోలేకపోయారు. ఫస్ట్ డే ఈవెనింగ్ వరకు నెగిటివ్ టాక్ కంటిన్యూ అయింది. ఆ తర్వాత టాక్ మారి సినిమా సూపర్ హిట్ అయింది అని ప్రభాస్ తెలిపారు. 

Latest Videos

click me!