వెంకటేష్ రీమేక్ సినిమాలు మాత్రమే ఎక్కువగా చేయడానికి కారణం ఏంటి? వెంకీ రీమేక్ మూవీస్ లిస్ట్ లో బ్లాక్ బస్టర్స్

Published : Dec 13, 2025, 12:35 PM IST

Venkatesh Remake Movies : టాలీవుడ్ లో రీమేక్ ల రారాజుగా వెంకటేష్ కు మంచి పేరుంది. రీమేక్  సినిమాలు చేయాలంటే అంత ఈజీ కాదు.. అందుకు చాలా కష్టపడాలి. అంత కష్టపడుతూ.. బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు వెంకీ.. ఆయన కెరీర్ లో హిట్ రీమేక్ సినిమాలు ఇవే? 

PREV
15
రీమేక్ సినిమాల రారాజు

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో విక్టరీ వెంకటేష్‌ ఒకరు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జునతో పాటు టాలీవుడ్ నాలుగు పిల్లర్స్ లో వెంకటేష్ కూడా ఉన్నారు. అయితే అందరు హీరోలకంటే వెంకటేష్ చాలా ప్రత్యేకంగా ఉంటారు. ఇతర హీరోల మాదిరిగా మాస్ ఇమేజ్ కోసం పరితపించకుండా, తన కెరీర్ ప్రారంభం నుంచే కథాబలం ఉన్న సినిమాలను ఎంచుకుంటూ సినిమాలు చేశారు. ఈక్రమంలోనే ఆయనకు రీమేక్ కథలు బాగా కలిసి వచ్చాయి. వాటితోనే ఎక్కువ విజయాలు సాధించాడు వెంకటేష్. దాంతో ఇతర భాషల్లో తనకు బాగా సూట్ అయ్యే..మంచి మంచి కథలను ఎంచుకుని మరీ సినిమాలు చేయడం స్టార్ట్ చేశాడు వెంకటేష్. రీమేక్ సినిమాలే వెంకటేష్ ను ఫ్యామిలీ ఆడియన్స్ కు మరింతగా దగ్గర చేశాయి. హిట్ శాతం పరంగా చూసుకుంటే, వెంకటేష్ టాలీవుడ్‌లో అత్యధిక రీమేక్ విజయాలు సాధించిన హీరోగా రికార్డు సాధించారు.

25
రీమేక్ సినిమాలు చేయడం అంత సులువు కాదు..

సాధారణంగా రీమేక్ సినిమాల్లో నటించడం ఈజీ అనుకుంటారు. కానీ అది అంత సులువు కాదు. ఒరిజినల్ వెర్షన్‌లో నటించిన హీరో అద్భుతంగా నటించి ఉంటే, రీమేక్‌లో అంతకు మించి చూపించగలగాలి. ఒరిజినల్ పాత్ర ప్రభావం కనిపించకుండా.. ఆడియన్స్ ను కన్విన్స్ చేయగలగాలి. ఇక ఎంత బాగా చేసినా కొన్ని పోలికలు మాత్రం పాత్రను వెంటాడుతూ వస్తుంటాయి. వాటిని కూడా ఆడియన్స్ యాక్సప్ట్ చేసేలా నటించగలగాలి. రీమేక్ లోనే అద్భుతంగా చేశారు అని ఆడియన్స్ చేత అనిపించగలిగితే చాలు.. ఆసినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినట్టే. వెంకటేష్ సంగతి చూసుకుంటే.. ఆయన ఇటువంటి సవాళ్లను సులభంగా అధిగమించారు. ప్రతి పాత్రను తనదైన శైలిలో ఓన్ చేసుకుని, ఒరిజినల్‌ను మించిన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. అందుకే వెంకీ తన కెరీర్ లో ఎక్కువ రీమేక్ కథలకు ఇంపార్టెన్స్  ఇచ్చారు.

35
ఇప్పటికీ రీమేక్ ఫార్ములా ఫాలో అవుతున్న వెంకీమామ

వెంకటేష్ లుక్, బాడీ లాంగ్వేజ్, సహజ నటన ఆయా పాత్రలకు పూర్తిగా సరిపోయేలా ఉండడం ఆయనకు ఉన్న పెద్ద ప్లస్ పాయింట్. అందుకే రీమేక్ సినిమాలు అయినప్పటికీ అవి ఒరిజినల్‌లా అనిపించే స్థాయిలో విజయవంతమయ్యాయి. ఇప్పటికీ దృశ్యం సిరీస్ లు, నారప్ప లాంటి సినిమాలతో వెంకీ సక్సెస్ సాధించడం చూస్తూనే ఉన్నాం. ఇక వెంకటేష్ కెరీర్‌లోని ముఖ్యమైన రీమేక్ చిత్రాల విషయానికి వస్తే, 1989లో మలయాళం మూవీ ‘ఆర్యన్’కి రీమేక్‌గా ‘ధ్రువ నక్షత్రం’ సినిమాను వై. నాగేశ్వరరావు దర్శకత్వం లో చేశారు. 1988లో తమిళ సినిమా ‘తీర్ధ కనలై’ ఆధారంగా ‘వారసుడొచ్చాడు’ సినిమాను ఏ. మోహన్ గాంధీ డైరెక్షన్ లో చేశాడు వెంకీమామ.

45
వెంకటేష్ రీమేక్ సినిమాలలో కొన్ని

హిందీలో అనిల్ కపూర్ హీరోగా నటించిన ‘తేజాబ్’ సినిమాను తెలుగులో ‘టూ టౌన్ రౌడీ గా రీమేక్ చేశాడు వెంకటేష్.. అలాగే గోవిందా హీరోగా నటించిన ‘అంకెన్’ సినిమాకు రీమేక్‌గా ‘పోకిరి రాజా’ తీశారు. ఇక తమిళం నుంచి చాలా రీమేక్ లను తీసుకున్నాడు విక్టరీ హీరో. అక్కడ సూపర్ హిట్ అయిన ‘సూర్యవంశం’ సినిమాను అదే టైటిల్‌తో తెలుగులో చేయగా, ఆ సినిమా ఇక్కడ కూడా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో వెంకటేష్ అదరగొట్టాడు. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ తమిళ చిత్రం ‘అన్నామలై’కి రీమేక్‌గా 1993లో వెంకటేష్‌ ‘కొండపల్లి రాజా’ సినిమాను చేశారు ఈసినిమాను రవిరాజా పినిశెట్టి డైరెక్ట్ చేశారు. తమిళంలో ‘ఎంగ చిన్నరాజా’కి రీమేక్‌గా ‘అబ్బాయిగారు’ తెరకెక్కగా, తమిళంలో జెమినీ సినిమాను కూడా తెలుగులో అదే టైటిల్ తో వెంకీ చేశారు. కానీ తమిళ్ లో హిట్ అయిన ఈసినిమా.. తెలుగులో మాత్రం డిజాస్టర్ అయ్యింది.

55
హాలీవుడ్ ను కూడా వదలిపెట్టని వెంకటేష్..

తమిళం లో సూర్య హీరోగా నటించిన ‘కాకా కాకా’ సినిమాను తెలుగులో ‘ఘర్షణ’ పేరుతో వెంకటేష్ హీరోగా తెరకెక్కించారు. ఈసినిమా యూత్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది. ఈసినిమా మ్యూజిక్ ఇప్పటికీ శ్రోతలను ఉర్రూతలూగిస్తుంది. అంతే కాదు ఈసినిమాలో వెంకీ నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చాయి. ఇక హాలీవుడ్ నుంచి కూడా వెంకీ సినిమాలు రీమేక్ అయ్యాయి. హాలీవుడ్ మూవీ ‘ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్’ ఆధారంగా దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు ‘ముద్దుల ప్రియుడు’ సనిమాను రూపొందించారు. ఈ సినిమా ఇక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇలా రీమేక్ సినిమాల్లో తన మార్క్ చూపిస్తూ.. వెంకటేష్ టాలీవుడ్‌లో విక్టరీ హీరోగా నిలిచారు.

Read more Photos on
click me!

Recommended Stories