Venkatesh: శ్రీవిష్ణుతో వెంకటేష్‌ నెక్ట్స్‌ మూవీ.. డైరెక్టర్‌, జోనర్‌ డిటెయిల్స్ నిజంగా క్రేజీ

Published : Feb 03, 2025, 09:14 PM IST

Venkatesh Next Movie: వెంకటేష్‌ దశాబ్దానికి సరిపోయే హిట్‌ని కొట్టారు. `సంక్రాంతికి వస్తున్నాం` చిత్రంతో ఇండస్ట్రీని షేక్‌ చేశాడు. ఇప్పుడు మరో ఎంటర్‌టైన్‌మెంట్ మూవీతో రాబోతున్నారు.   

PREV
14
Venkatesh: శ్రీవిష్ణుతో వెంకటేష్‌ నెక్ట్స్‌ మూవీ.. డైరెక్టర్‌, జోనర్‌ డిటెయిల్స్ నిజంగా క్రేజీ
venkatesh, sree vishnu

Venkatesh sri vishnu Movie:  విక్టరీ వెంకటేష్‌ ఈ సంక్రాంతికి `సంక్రాంతికి వస్తున్నాం` సినిమాతో బ్లాక్‌ బస్టర్‌ అందుకున్నారు. బ్లాక్‌ బస్టర్‌ అని చెప్పినా తక్కువే. ఇండస్ట్రీ హిట్‌ కొట్టాడు. పాన్‌ ఇండియా సినిమాలు కాకుండా రిజనల్‌ లాంగ్వేజెస్‌లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా ఇది నిలిచింది. సీనియర్‌ హీరోల్లోనూ అత్యధిక వసూళ్లని రాబట్టిన హీరోగా నిలిచారు వెంకీమామ. వెంకీకి సరైన సినిమా పడితే ఏ రేంజ్‌లో ఉంటుందో ఈ మూవీ నిరూపించింది. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన `సంక్రాంతికి వస్తున్నాం` చిత్రంలో మీనాక్షి చౌదరీ, ఐశ్వర్యా రాజేష్‌ హీరోయిన్లుగా నటించిన విషయం తెలిసిందే. దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మించారు.

24
venkatesh

వెంకటేష్‌ నెక్ట్స్ సినిమా ఏంటనేది ఇంకా కన్ఫమ్‌ కాలేదు. త్వరలోనే ఆయన `రానా నాయుడు` సీక్వెల్‌ వెబ్‌ సిరీస్‌లో పాల్గొనబోతున్నారు. Netflix కోసం ఈ సిరీస్‌ని చేస్తున్న విషయం తెలిసిందే. సినిమాల పరంగా వెంకీ ఇప్పటి వరకు క్లారిటీ కన్ఫమ్‌ చేయలేదు. పలు ప్రాజెక్ట్ లు చర్చల దశలోనే ఉన్నాయని సమాచారం. అయితే తాజాగా నెక్ట్స్ సినిమాకి సంబంధించి ఇంట్రెస్టింగ్‌ అప్‌ డేట్‌ బయటకు వచ్చింది. 
 

34
venkatesh

వెంకటేష్‌ మరోసారి యంగ్‌ హీరోతో కలిసి మల్టీస్టారర్ చేయబోతున్నారట. ఇటీవల కామెడీ చిత్రాలతో అలరిస్తున్న శ్రీవిష్ణుతో కలిసి సినిమా చేయబోతున్నారట. ఈ మూవీ ద్వారా ఓ రైటర్‌ని దర్శకుడిగా పరిచయం చేయబోతున్నారు. ఆయన `సామజవరగమన` చిత్రానికి రైటర్‌గా పనిచేసినట్టు సమాచారం. వెంకటేష్‌ మెయిన్‌ హీరోగా ఉంటారని, శ్రీవిష్ణుది మరో ముఖ్యమైన పాత్ర అని తెలుస్తుంది. దాదాపు ఈ ప్రాజెక్ట్ ఓకే అయ్యిందని సమాచారం. కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీని తెరకెక్కించబోతున్నారు. అన్ని ఓకే అనుకుంటే ఈ మార్చిలో సినిమా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 
 

44
venkatesh

వెంకటేష్‌ కి ప్రధాన బలం కామెడీ. అవి కాకుండా యాక్షన్‌ మూవీస్‌, థ్రిల్లర్‌ చిత్రాలు చేసి చేదు అనుభవాలను చవి చూశారు. అలాంటి చిత్రాలు బాక్సాఫీసు వద్ద డీలా పడ్డాయి. ఈ క్రమంలో కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ తో `సంక్రాంతికి వస్తున్నాం` సినిమాని చేశాడు. అది కూడా సంక్రాంతికే రిలీజ్‌ చేశారు. దీంతో ఇది అఖండ విజయం సాధించింది. ఈ మూవీ వెంకీకి కూడా ఓ లెసన్‌గా నిలిచింది. అందుకే కొత్త ప్రాజెక్ట్ ల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారట. ఎంటర్‌టైన్‌మెంట్‌ కే ప్రయారిటీ ఇస్తున్నారట. అందులో భాగంగానే ఇప్పుడు శ్రీవిష్ణుతో కలిసి ఈ మూవీని చేసేందుకు రెడీ అయినట్టు సమాచారం. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories