డ్రగ్స్ కేసులో మస్తాన్ సాయి గతంలోనే అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు మరోసారి ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే తాజాగా స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్ లో ప్రముఖులు ప్రైవేట్ వీడియోలు ఉన్నాయట. అందులో హీరో నిఖిల్ ఫోన్‌ని కూడా హ్యాక్ చేసినట్టు, ఆయనకు సంబంధించిన వీడియోలు,
అలాగే వరలక్ష్మి టిఫిన్ సెంటర్ ఓనర్ ప్రభాకర్ రెడ్డి ప్రైవేట్ వీడియోలు కూడా ఉన్నట్టు వార్తలు బయటకు వస్తున్నాయి. అయితే దీనిపై మస్తాన్ సాయి స్పందిస్తూ, తన వద్ద ఎలాంటి వీడియోలు లేవని తెలిపారు. లావణ్య తనని కావాలని ఇరికించిందంటున్నారు. మస్తాన్ సాయిని కోర్టు లో హాజరు పర్చగా, 14 రోజుల రిమాండ్ విధించింది.