Trisha Identity movie leaked in Ibomma : ఎంత పెద్ద చిత్రం అయినా టొరెంట్ వెబ్ సైట్స్ లో లీక్ అవుతుంటాయి. సంక్రాంతికి విడుదలైన తెలుగు చిత్రాలు ఆల్రెడీ ఐబొమ్మలో లీక్ అయ్యాయి.
Trisha Identity movie leaked in Ibomma :ఎంత పెద్ద చిత్రం అయినా టొరెంట్ వెబ్ సైట్స్ లో లీక్ అవుతుంటాయి. సంక్రాంతికి విడుదలైన తెలుగు చిత్రాలు ఆల్రెడీ ఐబొమ్మలో లీక్ అయ్యాయి. ఆ చిత్రాలని చూసేందుకు నెటిజన్లు ఎగబడుతున్నారు. సంక్రాంతికి విడుదలైన బాలయ్య డాకు మహారాజ్, రాంచరణ్ గేమ్ ఛేంజర్ చిత్రాలు కూడా ఐబొమ్మలో లీక్ అయ్యాయి.
24
Trisha identity movie
హెచ్ డి క్వాలిటీ వెర్షన్ ని ఇందులో ఓటిటి కంటే ముందుగా లీక్ చేశారు. అయితే ఈ చిత్రాలకు ధీటుగా మలయాళీ చిత్రం ఒకటి ఐబొమ్మలో హల్ చల్ చేస్తోంది. ఆ చిత్రం పేరు ఐడెంటిటీ. ఈ చిత్రంలో మలయాళీ క్రేజీ హీరో టివినో థామస్, స్టార్ హీరోయిన్ త్రిష, మందిరా బేడీ కీలక పాత్రల్లో నటించారు. జనవరి 2న థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది.
34
Tovino Thomas Identity
ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కావడంతో ఆ జోనర్ ని ఇష్టపడే ఆడియన్స్ ఎగబడి చూస్తున్నారు. ఐబొమ్మలో ఈ చిత్రం లీక్ అయింది. అదే విధంగా జీ 5 ఓటీటీలో అధికారికంగా రిలీజ్ అయింది.
44
ఈ చిత్రానికి మంచి రివ్యూలు వచ్చాయి. మలయాళీ చిత్రాలు అంటే కంటెంట్ ప్రధానంగా ఉంటాయి. ఈ చిత్రంలో త్రిష ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ పాత్రలో నటించింది. త్రిష ఒక హత్యని చూసి సమస్యల్లో చిక్కుకుంటుంది. ఈ కేసుతో హీరో టివినో థామస్ కి సంబంధం ఏంటి.. నిజమైన హంతకుడి బయట పడ్డాడా అనే అంశాలు ఆసక్తికరంగా ఉంటాయి.