Venkatesh Top 10 Movies: తప్పక చూడాల్సిన వెంకటేష్‌ టాప్‌ 10 మూవీస్‌.. ఇలాంటి రికార్డు ఉన్న ఒకే ఒక్క హీరో

Published : Dec 13, 2025, 10:10 AM IST

విక్టరీ వెంకటేష్‌ నేడు శనివారం(డిసెంబర్‌ 13)న తన 65వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన నటించిన చిత్రాల్లో ప్రతి ఒక్కరు తప్పక చూడాల్సిన బెస్ట్‌ టాప్‌ 10 సినిమాలేంటో తెలుసుకుందాం. 

PREV
111
1. నువ్వు నాకు నచ్చావ్‌

వెంకటేష్‌ నటించిన తప్పక చూడాల్సిన టాప్‌ 10 మూవీస్‌లో `నువ్వు నాకు నచ్చావ్` మొదటి స్థానంలో నిలిచింది. కె విజయ్‌ భాస్కర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆర్తి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటించింది. రొమాంటిక్‌ కామెడీ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కింది. ప్రకాష్‌ రాజ్‌, చంద్రమోహన్‌, సునీల్‌ కీలక పాత్రలు పోషించారు. 2001లో విడుదలైన ఈ మూవీ ఆ ఏడాది ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. దీనికి ఐఎండీబీలో 8.8రేటింగ్‌ ఇచ్చింది.

211
2.బ్రహ్మపుత్రుడు

వెంకటేష్‌ హీరోగా, రజనీ హీరోయిన్‌గా, మోహన్‌బాబు, జయసుధ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి దాసరి నారాయణ రావు దర్శకుడు. ఆద్యంతం నాటకీయంగా సాగే ఈ మూవీ 1988లో విడుదలై బాక్సాఫీసు వద్ద దుమ్ములేపింది. కాసుల వర్షం కురిపించింది. అప్పట్లో వెంకీ కెరీర్‌లో మాస్‌ కమర్షియల్‌ హిట్‌గా నిలిచింది. అదే సమయంలో కెరీర్‌ బిగినింగ్‌లో బిగ్గెస్ట్ బ్రేక్‌ ఇచ్చిన మూవీ ఇదే అని చెప్పొచ్చు. దీనికి ఐఎమ్‌డీబీ 8.2 రేటింగ్‌ ఇచ్చింది.

311
3.దృశ్యం

వెంకటేష్‌ నటించిన క్రైమ్‌ థ్రిల్లర్‌ చిత్రాల్లో ది బెస్ట్ గా నిలిచిన మూవీ `దృశ్యం`. ఇది మలయాళంలో వచ్చిన `దృశ్యం`కి రీమేక్‌. శ్రీప్రియ దర్శకత్వం వహించిన ఈ మూవీ 2014లో విడుదలైంది. సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఇందులో మీనా వెంకీకి జోడీ కట్టింది. ఆద్యంతం థ్రిల్లింగ్‌, ట్విస్ట్ లు, టర్న్ లతో సాగే ఈ మూవీకి ఐఎండీబీ 8.2 రేటింగ్‌ ఇచ్చింది.

411
4.స్వర్ణకమలం

వెంకటేష్‌ నటించిన మ్యూజికల్‌ డాన్స్ ఫిల్మ్ `స్వర్ణ కమలం`. దీనికి కె విశ్వనాథ్‌ దర్శకత్వం వహించారు. వెంకటేష్‌ వరుసగా మాస్‌ సినిమాలతో అలరిస్తున్న నేపథ్యంలో కంప్లీట్‌గా ఆయన ఇమేజ్‌ని మార్చిన మూవీ ఇది. వెంకటేష్‌, భానుప్రియా జంటగా నటించారు. ఈ జంట ఎంతగానో ఆకట్టుకుంది. 1988లో విడుదలై బాక్సాఫీసు వద్ద మంచి హిట్‌గా నిలిచింది. దీనికి ఐఎండీబీ 8.1 రేటింగ్‌ ఇచ్చింది. తప్పక చూడాల్సిన వెంకీ సినిమాల జాబితాలో చేర్చింది.

511
5.క్షణక్షణం

వెంకటేష్‌, రామ్‌గోపాల్‌ వర్మ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా `క్షణక్షణం`. రోడ్‌ కామెడీ హీస్ట్ మూవీ. ఇందులో అతిలోక సుందరి శ్రీదేవి హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీ 1991లో విడుదలైంది. సంచలన విజయం సాధించింది. ఇందులో వెంకటేష్‌ కంటే శ్రీదేవి కామెడీ హైలైట్‌గా నిలుస్తుంది. ఆమె నటన అబ్బురపరుస్తుంది. దీనికి ఐఎండీబీ 8.1 రేటింగ్‌ ఇచ్చింది. వెంకీ మూవీస్‌లో తప్పక చూడాల్సిన సినిమాగా నిలిపింది.

611
6.మల్లీశ్వరి

`నువ్వు నాకు నచ్చావ్‌` తరహాలో వెంకటేష్‌ నటించిన క్రేజీ రొమాంటిక్‌ కామెడీ చిత్రం `మల్లీశ్వరి`. దీనికి కూడా కె విజయభాస్కర్‌ దర్శకత్వం వహించడం విశేషం. ఇందులో వెంకటేష్‌ పెళ్లి కాని ప్రసాద్‌గా ఇరగదీశారు. నవ్వులు పూయించారు. చివర్లో ఎమోషన్‌ టచ్‌ ఇచ్చి మళ్లీ కామెడీతో నవ్వించారు. ఇందులో బాలీవుడ్‌ భామ కత్రినా కైఫ్‌ నటించడం విశేషం. మొదట ఆమె ఈ మూవీ చేసేందుకు ఒప్పుకోలేదు, చాలా రోజులు కన్విన్స్ చేసి చేయించారు. సినిమా పెద్ద హిట్‌ అయ్యింది. దీనికి ఐఎండీబీ 7.8 రేటింగ్‌ ఇచ్చింది. తప్పక చూడాల్సిన మూవీగా నిలిపింది.

711
7.రాజా

వెంకటేష్‌ నటించిన మరో రొమాంటిక్‌ డ్రామా `రాజా`. ముప్పలనేని శివ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో సౌందర్య హీరోయిన్‌ కావడం విశేషం. ఇందులో సౌందర్యని గొప్ప సింగర్‌గా నిలిపేందుకు వెంకటేష్ చేసిన ప్రయత్నమే మూవీ. కామెడీగా సాగుతూ, చివర్లో ఎమోషనల్‌గా ముగుస్తుంది. ఇందులో వెంకటేష్‌ నటన వాహ్‌ అనిపిస్తుంది. ఈ సినిమాలో అబ్బాస్‌ మరో కీలక పాత్ర పోషించారు. 1999లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద సూపర్‌ హిట్‌గా నిలిచింది. విమర్శకుల ప్రశంసలందుకుంది. దీనికి ఐఎండీబీ 7.7 రేటింగ్‌ ఇచ్చింది.

811
8.ఆడవారి మాటలకు అర్థాలు వేరులే

వెంకటేష్‌ నటించిన మరో రొమాంటిక్‌ కామెడీ డ్రామా `ఆడవారి మాటకు అర్థాలు వేరులే`. సెల్వరాఘవన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో త్రిష్‌ హీరోయిన్‌గా నటించింది. శ్రీరామ్ కీలక పాత్రలో నటించారు. ఇది ఫస్ట్ కామెడీగా సాగుతూ, ఎమోషనల్‌గా టర్న్ తీసుకుంటుంది. డ్రామా ఆకట్టుకుంటుంది. 2007లో విడుదలైన ఈ చిత్రం డీసెంట్‌గానే ఆడింది. కానీ విమర్శకుల ప్రశంసలందుకుంది. దీనికి ఐఎండీబీ 7.6 రేటింగ్ ఇచ్చింది.

911
9.ప్రేమ

వెంకటేష్‌ నటించిన మ్యూజిక్‌ రొమాంటిక్‌ ఫిల్మ్ `ప్రేమ`. ఇందులో వెంకటేష్‌ సరసన రేవతి నటించింది. సురేష్‌ కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి ఇళయరాజా పాటలు హైలైట్‌గా నిలిచాయి. 1989లో విడుదలైన ఈ చిత్రం సూపర్‌ హిట్‌గా నిలిచింది. నాలుగు నంది అవార్డులను గెలుచుకుంది. మంచి ప్రశంసలు కూడా అందుకుంది. దీనికి ఐఎండీబీ 7.4 రేటింగ్‌ ఇచ్చింది.

1011
10.చంటి

వెంకటేష్‌ అద్భుతమైన నటనకు ప్రతిబింబం `చంటి` మూవీ. ఇందులో ఇన్నోసెంట్‌ అబ్బాయిగా వెంకీ నటన ఆకట్టుకుంటుంది. ఇందులో వెంకీకి జోడీగా మీనా హీరోయిన్‌గా నటించింది. రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించారు. 1992లో విడుదలైన ఈ మూవీ సంచలన విజయం సాధించింది. వెంకటేష్‌ నటించిన చిత్రాల్లో తప్పక చూడాల్సిన మూవీగా నిలిచింది. దీనికి ఐఎండీబీ 7 రేటింగ్‌ ఇచ్చింది.

1111
వెంకటేష్‌ రేర్‌ రికార్డ్

ఇలా వెంకటేష్‌ తన కెరీర్‌లో అన్ని రకాల చిత్రాలు చేశారు. కామెడీ చిత్రాలు, రొమాంటిక్‌ కామెడీ, ఫ్యామిలీ చిత్రాలు, యాక్షన్‌ చిత్రాలు, థ్రిల్లర్స్, హర్రర్స్, సోషియో ఫాంటసీ, డార్క్ కామెడీ, డ్రామా ఇలా అన్ని జోనర్‌ చిత్రాలు చేసి మెప్పించారు. విజయాలు అందుకున్నారు. అదే సమయంలో ఎక్కువగా రీమేక్‌ సినిమాలతో విజయాలు అందుకున్న హీరోగా నిలిచారు. మరోవైపు ఎక్కువగా మల్టీస్టారర్స్ చేసిన హీరోగా నిలిచారు. సీనియర్‌ హీరోల్లో చిరంజీవి, నాగార్జున, బాలయ్యలకు సాధ్యం కాని విధంగా ఇప్పటి వరకు అత్యధిక కలెక్షన్లు సాధించిన హీరోగా వెంకీ నిలవడం విశేషం. ఈ ఏడాది `సంక్రాంతికి వస్తున్నాం` మూవీతో ఏకంగా మూడు వందల కోట్లు రాబట్టిన విషయం తెలిసిందే. ఇలా మిగిలిన హీరోలతో స్పెషల్‌ గా నిలిచిన వెంకీ నేడు 65వ పుట్టిన రోజు జరుపుకుంటుండటం విశేషం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories