వెంకటేష్‌ హీరో కాకపోతే ఏం చేసేవాడో తెలుసా? వెంకీమామ అసలు డ్రీమ్‌ ఇదే!

First Published | Dec 30, 2024, 4:45 PM IST

విక్టరీ వెంకటేష్‌ అనుకోకుండా హీరో అయ్యాడు. అనుకోకుండా సినిమాల్లోకి వచ్చాడు. మరి ఆయన డ్రీమ్‌ ఏంటి? ఏం చేయాలనుకున్నారు? ఇంట్రెస్టింగ్‌ విషయాలను బయటపెట్టారు. 
 

photo credit- aha-unstoppable 4

వెంకటేష్‌ అనుకోకుండా సినిమాల్లోకి వచ్చాడు. నాన్న, నిర్మాత రామానాయుడికి హీరో దొరక్కపోతే వెంకటేష్‌ని సినిమాల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. సూపర్‌ స్టార్‌ కృష్ణ కారణంగానే వెంకీ సినిమాల్లోకి వచ్చారని అంటుంటారు.

ఆయన మొదట సురేష్‌ ప్రొడక్షన్‌లో ఓ సినిమాకి కమిట్‌ అయి, డేట్స్ కుదరకపోవడంతో తప్పుకున్నారు. దీంతో తమకు అర్జెంట్‌గా హీరో కావాలి. ఎవరు అనుకున్నప్పుడు ఇంకా ఎవరో ఎందుకు వెంకటేష్‌నే పెట్టుకుంటే పోలే అనుకున్నారు. ఆయన్ని రంగంలోకి దించారు. 
 

photo credit- aha-unstoppable 4

అలా `కళియుగ పాండవులు` చిత్రంతో హీరోగా మారారు వెంకటేష్‌. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. యాక్షన్‌ హీరోగా కెరీర్‌ని ప్రారంభించారు. ఆ తర్వాత లవ్‌ స్టోరీస్‌తో మెప్పించారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ తో ఫ్యామిలీ ఆడియెన్స్ కి దగ్గరయ్యారు.

ఫ్యామిలీ ఆడియెన్స్ లో వెంకీకి ఉన్న క్రేజ్‌, ఇమేజ్‌ మరెవ్వరికీ లేదని చెప్పొచ్చు. ఆయన సక్సెస్‌ రహస్యం కూడా అదే. మంచి ఫ్యామిలీ ఎలిమెంట్లు ఉన్న సినిమాలతో విజయాలు అందుకుని విక్టరీ వెంకటేష్‌గా ఎదిగారు. 

read more: రామానాయుడి తీరని రెండు కోరికలు, గుర్తు చేసుకుంటూ బాలయ్య షోలో వెంకటేష్‌, సురేష్‌బాబు ఎమోషనల్‌
 


photo credit- aha-unstoppable 4

మరి అనుకోకుండా హీరోగా మారిన వెంకటేష్‌ అసలు డ్రీమ్‌ ఏంటి? ఆయన ఏం చేయాలనుకున్నారు? ఏ రంగాన్ని ఎంచుకోవాలనుకున్నారు? ఏ రూట్‌లో వెళ్లాలనుకున్నారనేది తెలుసుకుంటే ఆసక్తికర విషయాలను బయటపెట్టారు వెంకటేష్‌. తనకు వ్యాపారం చేయాలని ఉండేదట. అంతేకాదు అసలు ఫారెన్‌లోనే సెటిల్‌ కావాలనుకున్నారట.

వెంకీ ఫారెన్‌లో స్టడీస్‌ చేశాడు. సినిమాలకు దూరంగానే పెరిగారు. హైదరాబాద్‌లో ఉన్నప్పుడు అడపాదడపా సినిమాలతో టచ్‌ ఉన్నా, ఎప్పుడూ ప్రొడక్షన్‌లో ఇన్‌వాల్వ్ అయ్యింది లేదు. పూర్తిగా స్టడీస్‌ మీదనే ఉండేది. అలా ఫారెన్‌లో ఆయన స్టడీస్‌ చేశారు. 
 

photo credit- aha-unstoppable 4

అక్కడే ఏదైనా బిజినెస్‌ స్టార్ట్ చేయాలనుకున్నారట. ఫారెన్‌లోనే సెటిల్‌ అయిన కాలిఫోర్నియాలో బీచ్‌ సైడ్‌ ఓ ఇళ్లు కట్టుకుని అక్కడే ఉండిపోవాలనుకున్నారట వెంకటేష్‌. 1986లో బిజినెస్‌ చేద్దామని ఇండియాకి వచ్చాడట. కానీ అది వర్కౌట్‌ కాలేదట. దీంతో ఏంటి ఆలోచిస్తున్నప్పుడు ఓ రోజు సడెన్‌గా నాన్న రామానాయుడు అడిగాడట.

ఇలా సినిమా చేయాలని. దర్శకుడు రాఘవేంద్రరావు కూడా ప్రోత్సహించారట. ఏదో సరదాగా ట్రై చేద్దామని చేశాడట వెంకటేష్‌. సినిమా పెద్ద హిట్‌ కావడంతో ఇక అదే దారిలో వెళ్లారు. ఇప్పటికీ నాలుగు దశాబ్దాలుగా సినిమాలు చేస్తూ టాలీవుడ్‌ ఇండస్ట్రీలో టాప్‌ హీరోగా నిలబడ్డారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జునలకు దీటుగా సినిమాలు చేసి మెప్పించారు. 
 

తన కెరీర్‌లో ఇప్పటికే 75సినిమాలు పూర్తి చేశారు వెంకటేష్‌. ఇప్పుడు అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో `సంక్రాంతికి వస్తున్నాం` అనే చిత్రంలో నటిస్తున్నారు. ఐశ్వర్యా రాజేష్‌, మీనాక్షి చౌదరీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీని దిల్‌ రాజు నిర్మించారు.

ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆయన బాలకృష్ణ `అన్‌ స్టాపబుల్‌` విత్‌ ఎన్బీకే షోలో పాల్గొన్నారు. బాలయ్యతో కలిసి ఆయన రచ్చ చేశారు. ఇందులో పైన చెప్పిన తన డ్రీమ్‌ గురించి తెలిపారు వెంకటేష్‌. 

also read: రామ్‌ చరణ్‌లో ఉన్న పెద్ద బలహీనత బయటపెట్టిన ఎన్టీఆర్‌.. ర్యాగింగ్‌ వేరే లెవల్‌
 

Latest Videos

click me!