‘పుష్ప 2’ షాక్ : సీడెడ్ లాభం, ఆంధ్రాలో నష్టం

Published : Dec 30, 2024, 01:44 PM IST

'పుష్ప 2' మూవీ 1700 కోట్ల కలెక్షన్స్ ని క్రాస్ చేసింది. సీడెడ్ లో లాభాలు, ఆంధ్రాలో నష్టాలు ఉన్నాయి. సీడెడ్ లో 'దేవర' కలెక్షన్స్ ని అధిగమించింది.

PREV
15
‘పుష్ప 2’ షాక్ :  సీడెడ్ లాభం, ఆంధ్రాలో నష్టం


'పుష్ప 2' మూవీ ప్రభంజనం రిలీజై ఇన్నాళ్లు అయినా ఇప్పటికీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. క్రిస్మస్ హాలిడేస్ ఈ సినిమాకి పూర్తిగా ప్లస్ అయ్యాయి. అన్ని ఏరియాల నుంచి డీసెంట్ వసూళ్లని అందుకుంటూ ముందుకు వెళ్తున్న  1700 కోట్ల కలెక్షన్స్ ని  ఇప్పటికే ఈ మూవీ క్రాస్ చేసింది.

నాలుగో వారం లోకి కూడా దిగ్విజయంగా ఈ చిత్రం అడుగుపెట్టబోతోంది. శుక్ర, శని, ఆదివారాలు మరల ఈ మూవీకి మంచి వసూళ్లు వస్తున్నాయి. అయితే ఇప్పటిదాకా వచ్చిన ట్రేడ్ కలెక్షన్స్ బట్టి చూస్తే సీడెడ్ లో లాభాలు, ఆంధ్రాలో నష్టాలు అని తెలుస్తోంది

25


పుష్ప2(Pushpa2 The Rule Movie) మూడు వారాలను దిగ్విజయంగా కంప్లీట్ చేసుకుని ఊహకందని ఊచకోత కోస్తూ దూసుకు పోతోంది.  ఈ సినిమా….హిందీలో రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో  తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎపిక్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుంటూ ముందుకు వెళ్తోంది.  

రాయలసీమ ఏరియాలో నాన్ రాజమౌళి మూవీస్ లో హైయెస్ట్ కలెక్షన్స్ తో సంచలనం సృష్టించిన ఎన్టీఆర్(Jr NTR) నటించిన బ్లాక్ బస్టర్ హిట్ దేవర(Devara Part 1) సినిమా టోటల్ రన్… కలెక్షన్స్ ని బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది. సినిమా రిలీజ్ టైంలో కొంచం డ్రాప్స్ ను సొంతం చేసుకోవడంతో సీడెడ్ లో టార్గెట్ ను అందుకుంటుందో లేదో అని అనుమానాలు వచ్చినా సీడెడ్ లో వాల్యూ బిజినెస్ ను దాటేసి బ్రేక్ ఈవెన్ ని అందుకుంది.  కొనుక్కున్న వాళ్లప ఇప్పుడు లాభాలలోకి ఎంటర్  అయ్యారు.

35


సీడెడ్ లో ఈ చిత్రంపై 30 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ కలెక్షన్స్ నెంబర్ ని 'పుష్ప 2' క్రాస్ చేసింది. ఇక తాజాగా సీడెడ్ లో అత్యధిక వసూళ్లు అందుకున్న సినిమాల జాబితాలో టాప్ 3లో ఉన్న 'దేవర'ని ఈ చిత్రం క్రాస్ చేసింది.

'దేవర' మూవీ 31.85 కోట్ల గ్రాస్ తో మొన్నటి వరకు టాప్ 3లో ఉండేది.అయితే ఈ నెంబర్ ని 'పుష్ప 2' అధికమించి 32 కోట్లకి పైగా వసూళ్లని అందుకున్నట్లు తెలుస్తోంది. ఇదే జోరు కొనసాగితే లాంగ్ రన్ లో సీడెడ్ లో సెకండ్ హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న చిత్రంగా ఉన్న 'బాహుబలి 2' రికార్డ్ ని కూడా అధికమించే అవకాశం ఉంది.

45


అయితే ఊహించని విధంగా ఆంధ్రాలో అందరూ డిస్ట్రిబ్యూటర్స్ నష్టాల్లో ఉన్నారు. సీడెడ్ ఏరియా మాత్రమే లాభాల్లో నడుస్తోంది. నైజాం లో అయితే నో ఫ్రాఫిట్, నో లాస్ సిట్యువేషన్ రన్ అవుతోంది. నైజాంలో డిస్టిబ్యూషన్ చేసింది నిర్మాణ సంస్దే కాబట్టి ఇబ్బంది అయితే రాలేదు.  
 

55


ఇలా వసూళ్ల హవా కొనసాగిస్తున్న ‘పుష్ప 2’ ఓటీటీకి (Pushpa 2 OTT) వచ్చేస్తుందంటూ సోషల్ మీడియా వేదికగా ఇటీవల వార్తలు ట్రెండ్‌ అయ్యాయి. జనవరి రెండో వారం నుంచి స్ట్రీమింగ్‌ కానుందంటూ చర్చ సాగింది. ఆ వార్తలపై చిత్ర బృందం కొన్ని రోజుల క్రితం స్పందించింది. 56 రోజుల (థియేటర్లలో విడుదలైన నాటి నుంచి) కంటే ముందు ఏ ఓటీటీలోనూ ఈ మూవీ రిలీజ్‌ కాదని స్పష్టం చేసింది.
    
 

Read more Photos on
click me!

Recommended Stories