F3 Review:'ఎఫ్3' ట్విట్టర్ రివ్యూ .. వెంకీ, వరుణ్ నవ్వుల మెరుపులతో హోరు..సెకండాఫ్ పరిస్థితి ఏంటి..

First Published May 27, 2022, 6:12 AM IST

విక్టరీ, వెంకటేష్ , మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ఫన్ ఫ్రాంచైజీ ఎఫ్ 3 చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఎఫ్2 చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. ఆ చిత్రానికి సీక్వెల్ గా రాబోతున్న ఎఫ్3 పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

విక్టరీ, వెంకటేష్ , మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ఫన్ ఫ్రాంచైజీ ఎఫ్ 3 చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఎఫ్2 చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. ఆ చిత్రానికి సీక్వెల్ గా రాబోతున్న ఎఫ్3 పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. వెంకీ, వరుణ్ తేజ్ నవ్వుల జడివాన.. మెహ్రీన్, తమన్నా, సోనాల్ చౌహన్ లాంటి గ్లామర్ ముద్దుగుమ్మల అందాల జడివానలో ప్రేక్షకులని తడిపేందుకు ఎఫ్3 టీం రెడీ అయిపోయింది. 

తాజాగా ఈ చిత్ర ప్రీమియర్ షోలు ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రేక్షకులు తమ స్పందన తెలియజేస్తూ ట్విట్టర్ సినిమా విశేషాలని పంచుకుంటున్నారు. ఎఫ్ 3 లో నవ్వులు పండాయా .. ఎఫ్ 2 ని మించేలా ఉందా అనే విశేషాలని ప్రేక్షకులు తెలియజేస్తున్నారు. 

సినిమా ప్రారంభం కాగానే చకచకా క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ జరిగిపోతోంది. వెంటనే నవ్వుల జల్లులు కూడా షురూ అవుతాయి. వెంకటేష్ రేచీకటి ఉన్న వ్యక్తిగా, వరుణ్ తేజ్ నత్తి ఉన్న యువకుడిగా ఎఫ్3 లో కనిపిస్తున్నారు.  ఎప్పటిలాగే వెంకీ మామ టీనా కామెడీ టైమింగ్ తో అదరగొట్టేశాడు. వరుణ్ తేజ్ కూడా తన మార్క్ ప్రదర్శించాడు. 

సునీల్ ని చాలా కాలం తర్వాత కంప్లీట్ కామెడీ రోల్ లో చూడడం సంతోషంగా ఉందని ప్రేక్షకులు అంటున్నారు. ఫస్ట్ హాఫ్ లో మంచి ఫన్ సీన్స్ పడ్డాయి.సినిమాలో స్టోరీ ఏమీ ఉండదు. వరుసగా ఫన్ సీన్స్ వస్తూ నవ్విస్తూ ఉంటాయి. ఇది లాజిక్ లని పక్కన పెట్టి కంప్లీట్ గా ఎంజాయ్ చేసే చిత్రం అని ట్విటర్ లో ప్రేక్షకులు అంటున్నారు. 

ఎఫ్3లో అటు వెంకీ ఫ్యాన్స్ కి, ఇటు వరుణ్ తేజ్ ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ. హిట్టు సినిమా. ఎఫ్ 3 చిత్రం చూస్తూ చిన్నపిల్లలు పడి పడి నవ్వుతారు. పాపం ఓ పాప నవ్వుతూ కోక్ ని నా పక్క సీట్ లో వ్యక్తిపై పోసేసింది. 

ఎఫ్3లో దాదాపుగా జోక్స్ అన్నీ వర్కౌట్ అవుతున్నాయి ఫస్ట్ హాఫ్ డీసెంట్ గా ఉంది. వెంకటేష్ మెరుపులు మెరిపిస్తున్నాడు. వరుణ్ తేజ్ కూడా అదరగొట్టాడు. మరికొందరు మాత్రం సినిమా యావరేజ్ గా ఉందని పోస్ట్ లు పెడుతున్నారు. కొన్ని కామెడీ సీన్స్ మాత్రమే వర్కౌట్ అయ్యాయి. మిగిలినవి ఫోర్స్ ఫుల్ కామెడీగా అనిపిస్తాయి. 

మరికొందరు ప్రేక్షకులు ఎఫ్ 3 చిత్రం క్లయిమాక్స్ లో పూనకాలు తెప్పించే విధంగా ఉందని.. వెంకీ, వరుణ్ కామెడీ టైమింగ్ అదిరిపోయిందని అంటున్నారు. వీరిద్దరి కామెడీకి సునీల్, అలీ లాంటి పాత్రలు జత కలిసాయి అని అంటున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ డల్ అయిందని అంటున్నారు. 

click me!