F3 Movie Review: ఎఫ్3 మూవీ ప్రీమియర్ షో టాక్... మూవీ హిట్టా ఫట్టా!

First Published May 27, 2022, 5:45 AM IST

సక్సెస్ ఫుల్ చిత్రాలకు సీక్వెల్స్ కామన్. సదరు సీక్వెల్స్ పై అంచనాలు కూడా భారీగానే ఉంటాయి. 2019 సంక్రాంతి విన్నర్ గా నిలిచిన ఎఫ్2కి సీక్వెల్ గా తెరకెక్కిన ఎఫ్3 నేడు విడుదలైంది. వెంకటేష్-వరుణ్ తేజ్ ల మల్టీస్టారర్ గా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ ప్రీమియర్ షో టాక్ వచ్చేసింది.

F3 Movie Review


దాదాపు మూడేళ్ళ తర్వాత వెంకటేష్ (Venkatesh) వెండితెరపై కనిపిస్తున్నాడు. గని మూవీతో బొక్క బోర్లా పడ్డ వరుణ్ కమ్ బ్యాక్ కోరుకుంటున్నాడు. ఇక దర్శకుడు అనిల్ రావిపూడి సక్సెస్ జర్నీ కొనసాగించాలనుకుంటున్నాడు. మరి ఎఫ్2 రేంజ్ కామెడీ, ఎంటర్టైన్మెంట్ ఎఫ్3లో ఉందా... ప్రీమియర్స్ చూసిన ప్రేక్షకుల అభిప్రాయం ఏమిటో చూద్దాం.. 
 

F3 Movie Review


కామెడీ చిత్రాలకు బలమైన కథ అవసరం లేదు. పెద్దగా లాజిక్ ఫాలో కావాల్సిన అవసరం లేదు. సన్నివేశాలు, పాత్రలు, మాటలు ప్రేక్షకులకు నవ్వు తెప్పించాయా లేదా అన్నదే మేటర్. సక్సెస్ ఫుల్ ఎఫ్2 చిత్రంలో కూడా మనకు చెప్పుకోదగ్గ కనిపించదు. ఎఫ్3 కూడా అంతే.. మధ్యతరగతి జనాలు కోరుకునే పెద్ద ఇల్లు, కార్లు, నగలు, లగ్జరీలు... అవి తీర్చుకోవడానికి కావలసిన డబ్బుల కోసం వెంపర్లాట... ఇదే ఎఫ్3 (F3 Movie Review) మూవీ కథ. డబ్బు చుట్టూ పాత్రల ప్రయాణం సాగుతుంది. 

F3 Movie Review


 డబ్బుల కోసం జనాలు పడే పాట్లు అనే నేపథ్యంలో సాగే ఎఫ్3 (F3 Movie) చాలా వరకు సక్సెస్ అన్న మాట వినిపిస్తుంది.  కామెడీ తెరకెక్కించడంలో స్పెషలిస్ట్ గా చెప్పుకునే అనిల్ రావిపూడి రాసుకున్న సన్నివేశాలు, మాటలు, పాత్రలు, వాటి బిహేవియర్ హాస్యం పంచింది. ముఖ్యంగా వెంకటేష్, వరుణ్ (Varun Tej) కామెడీ టైమింగ్ బాగుంది అంటున్నారు. 
 

F3 Movie Review

ఫస్ట్ హాఫ్ చాలా ఆహ్లాదంగా సాగిపోతుంది. ఎఫ్2 మాదిరి వెంకీ-వరుణ్ కాంబినేషన్ మరో మారు హిట్ అంటున్నారు. అదే సమయంలో అనిల్ రావిపూడి ఈ చిత్రంలో చాలా ప్రయోగాలు చేశాడంటున్నారు. వెంకీ నారప్ప, వరుణ్ వకీల్ సాబ్ గెటప్స్ లో కనిపించడం లాంటివన్నమాట. తమన్నా(Tamannah), మెహ్రీన్ గ్లామర్, కామెడీ పర్లేదన్న మాట వినిపిస్తోంది.

F3 Movie Review


అయితే ఎఫ్3 సెకండ్ హాఫ్ పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదనేది చాలా మంది ప్రేక్షకుల అభిప్రాయం. క్లైమాక్స్ ఇంకొంచెం మెరుగ్గా చేసి ఉంటే బాగుండేది అంటున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ అందించిన సంగీతం మరొక మైనస్. ఆయన మ్యూజిక్ అంతగా ఆకట్టుకోలేదు. ఈసారి అనిల్ రావిపూడి పేరడి, క్రింజ్ కామెడీని నమ్ముకున్నారంటున్నారు. 
 

F3 Movie Review


జాతి రత్నాలు, డీజే టిల్లు చిత్రాల ప్రభావం ఆయనపై పడి ఉండవచ్చు. ఈ కారణం చేతనేమో అదే తరహా కామెడీ ఆయన ఎఫ్3 మూవీలో ట్రై చేసినట్లు తెలుస్తుంది. ఇది ఓ సెక్షన్ ఆడియన్స్ కి నచ్చితే మరో సెక్షన్ కి రొటీన్ అన్న భావన కలిగిస్తుంది. 

F3 Movie Review

ఇక కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చి పూజాతో స్పెషల్ సాంగ్ చేయించారు. ఈ పాట గురించి ఒక్కరు ప్రస్తావించడం లేదు. మ్యూజిక్ తో పాటు టేకింగ్ కూడా ఆకట్టుకోలేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి. కనీసం పూజా గ్లామర్ గురించి ఒక్కరూ ట్వీట్ చేయలేదు. 
 

F3 Movie Review

ఎఫ్2తో పోల్చితే ఎఫ్3లో భారీ తారాగణం నటించారు. సునీల్, ఆలీ, సోనాల్ చౌహాన్, మురళీ శర్మ వంటి స్టార్ కాస్ట్ యాడ్ అయ్యారు. వీరందరినీ అనిల్ రావిపూడి పూర్తి స్థాయిలో వాడుకోవడంలో సక్సెస్ కాలేదనిపిస్తుంది. ప్రాధాన్యత లేని పాత్రలు సినిమాకు అదనపు భారం తప్పితే ఏమీ ఉండదు. 
 

ప్రీమియర్స్ చూసిన మెజారిటీ ఆడియన్స్ అభిప్రాయం ప్రకారం ఎఫ్2 రేంజ్ లో ఎఫ్3 లేదు. అయితే ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే అంశాలు పుష్కలంగా ఉన్నాయి. అనిల్ రావిపూడి కామెడీ ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చితే సినిమా మంచి సక్సెస్ కొడుతుంది. సమ్మర్ హాలిడేస్ కూడా ఈ చిత్రానికి కలిసొచ్చే అంశం. ఇక చూడాలి ఫైనల్ గా ఎఫ్3 ఎలాంటి అంచనాలు అందుకుంటుందో...

click me!