బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ విన్నర్ బిందు మాధవికి బంపర్ ఆఫర్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్

Published : May 26, 2022, 10:32 PM IST

బిగ్ బాస్ వల్ల ఇప్పటి వరకూ భారీ  స్థాయిలో ఆఫర్లు సాధించిన ఆర్టిస్ట్ లు లేరు. కాని ఫస్ట్ టైమ్ బిగ్ బాస్ విన్నర్ గా నిలిచి బిందు మాధవి మాత్రం   బంపర్ ఆఫర్ కొట్టేసినట్టు తెలుస్తోంది. స్టార్ డైరెక్టర్, స్టార్ హీరో సినిమాలో నటించబోతోందట  బ్యూటీ. 

PREV
16
బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ విన్నర్  బిందు మాధవికి బంపర్ ఆఫర్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్

ఇప్పటి వరకూ బిగ్ బాస్ లోకి వెళ్లి వచ్చిన కంటెస్టెంట్స్ కాని, విన్నర్స్ కు కాని పెద్దగా కలిసి రాదు. అప్పటి వరకూ ఉన్న ఫేమ కూడా పోతూ వస్తోంది. శివబాలాజీ, కౌశల్, రాహుల్, అభిజిత్, లాంటి వారంతా ఇంతకు ముందు కంటే ఇమేజ్ తగ్గి కనిపించకుండా పోయారు.  కాని ఫస్ట్ టైమ్ బిగ్ బాస్ లేడీ విన్నర్ గా బిందు మాధవి.. వెంటనే పెద్ద ఆఫర్ సాధించిందట. 

26

బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ విజేతగా బిందు మాధవి నిలిచింది. తెలుగు బిగ్‌బాస్‌ చరిత్రలో ఓ మహిళ విన్నర్‌గా నిలవడం ఇదే తొలిసారి.  తెలుగు బిగ్‌బాస్‌ విన్నర్‌గా నిలిచి బిందు మాధవి చరిత్ర సృష్టించింది. టాస్క్‌లో.. మాటల్లో ఆడపులిలా రెచ్చిపోయిన బిందుకి ఒక్కసారిగా ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ విపరీతంగా పెరిగింది. 

36

ఇది వరకు ఆమె తెలుగులో పలు చిత్రాల్లో చేసిన రానీ గుర్తింపు ఒక్కసారిగా బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌తో తెచ్చుకుంది. దీంతో ఆమెకు టాలీవుడ్‌ నుంచి వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. 
 

46

ఇక ప్రస్తుతం  బిందుకు సంబంధించిన ఓ ఆసక్తికర అప్‌డేట్‌ నెట్టింట చక్కర్లు కొడుతోంది.  బిందు ఏకంగా  స్టార్‌ డైరెక్టర్‌ సినిమాలో చాన్స్‌ కొట్టేసిందంటూ  వార్తలు గుప్పుమన్నాయి. ఇండస్ట్రీలో వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న యంగ్‌ డైరెక్టర్‌ అనిల్‌రావిపూడి  నెక్ట్స్ మూవీలో బిందు నటించే చాన్స్ కొట్టేసిందని సమాచారం. 
 

56

అయితే ఇందులో మరో విషేశం ఏంటీ అంటే.. అనిల్ రావిపూడి.. బాలయ్య బాబుతో చేసే సినిమాలో బిందుకు మంచి పాత్రను ఆఫర్ చేశాడట. ఇది నిజం అయితే బిందు మాధవికి ఎలాంటి పాత్ర ఈ సినిమాలో    ఉంటుందో చూడాలి. 

66

కాగా ప్రస్తుతం అనిల్‌ రావిపూడి ఎఫ్‌ 3 మూవీ ప్రమోషన్‌తో బిజీగా ఉన్నాడు. దగ్గుబాటి హీరో విక్టరి వెంకటేశ్‌, మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ నటించి ఈ సినిమా రేపు(మే 27న) ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా తరువాత బాలయ్యతో సెట్స్ మీదకు వెళ్లబోతున్నాడు అనిల్. 
 

click me!

Recommended Stories