`వాల్తేర్‌ వీరయ్య`, `వీరసింహారెడ్డి` టోటల్‌ కలెక్షన్లు.. చిరు, బాలయ్యలో ఎవరి డామినేషన్‌ ఎంతంటే?

First Published Jan 16, 2023, 1:43 PM IST

చిరంజీవి, బాలకృష్ణ మరోసారి సంక్రాంతి బరిలో నిలిచారు. వీరు నటించిన `వాల్తేర్‌ వీరయ్య`, `వీరసింహారెడ్డి` సంక్రాంతి కానుకగా విడుదలైన విషయం తెలిసిందే. తాజాగా ఈ రెండు సినిమాల కలెక్షన్లు బయటకు వచ్చాయి. 

మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi), నందమూరి నటసింహాం బాలకృష్ణ(Balaakrishna) పండగపూట బాక్సాఫీసు వద్ద పోటీ పడ్డారు. ఈ ఇద్దరి సినిమాలు విడుదలై యావరేజ్‌ టాక్‌ని తెచ్చుకున్నాయి. కానీ కలెక్షన్ల విషయంలో సత్తా చాటాయి. అంచనా వేసినట్టుగానే భారీగానే ఆకట్టుకుంటున్నాయి. సంక్రాంతి పండుగ కావడంతో మంచి కలెక్షన్లు వస్తున్నాయి. ఫ్యాన్స్ ని ఖుషీ చేసే ఎలిమెంట్లు ఉండటంతో ఈ సినిమాలకి మంచి ఆదరణ దక్కుతుందని చెప్పొచ్చు. 
 

బాలయ్య నటించిన `వీరసింహారెడ్డి` ఫ్యాన్స్ కి నచ్చే ఎలిమెంట్లు చాలా ఉన్నాయి. స్టయిలీష్‌ ఫైట్లు బాగున్నాయి. కథ లేకపోవడం పెద్ద మైనస్‌. సెంటిమెంట్‌ సీన్లు వర్కౌట్‌ కాకపోవడం మైనస్‌. అయినా సంక్రాంతి కావడంతో భారీగానే  కలెక్షన్లు వస్తున్నాయి. ఈ చిత్రానికి నాలుగు రోజుల్లో ఇది వంద కోట్లు దాటింది. భారీ కలెక్షన్ల దిశగా ముందుకు సాగుతుంది. 
 

ఈ సినిమా నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 104 కోట్ల గ్రాస్‌ రాబట్టింది. సుమారు 60కోట్ల షేర్‌ని దక్కించుకుంది. అంతేకాదు ఓవర్సీస్‌లో అన్ని స్టేట్స్ లో కలిసి సుమారు పది కోట్లు వసూలు చేయడం విశేషం. ఆల్మోస్ట్ ఈ సినిమా బ్రేక్‌ ఈవెన్‌కి చేరుకుందని తెలుస్తుంది. ఇకపై వచ్చేది లాభాలే అని టాక్‌. VeerasimhaReddy Collections.
 

ఇక మెగాస్టార్‌ నటించిన `వాల్తేర్‌ వీరయ్య` ఎంటర్‌టైనింగ్‌గా ఉండటం కలిసొచ్చింది. వింటేజ్‌ చిరంజీవిని చూపించారని, ఆయన డాన్సులు, ఫైట్లు అదిరిపోయాయని అంటున్నారు. పైగా ఆయన  స్టయిల్‌ కామెడీ బాగా పేలింది. కొంత రొటీన్‌గానే ఉన్నా, అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది. సాధారణ ఆడియెన్స్ ని కూడా ఆకట్టుకుంటుంది. ఇదే ఈ సినిమాకి కలిసొచ్చింది. 
 

ఇక ఈ సినిమా మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.108కోట్ల గ్రాస్‌ వసూలు చేసింది. రూ.63కోట్ల షేర్‌ వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా ఓవర్సీస్‌లోనూ భారీగానే వసూలు చేసిందని, పది కోట్లకుపైగానే వచ్చాయని తెలుస్తుంది. ఈ సినిమా కేవలం మూడు రోజుల్లోనే వంద కోట్లు దాటడం విశేషం. ఈ సినిమా ఇప్పటి వరకు దాదాసు 70శాతం రికవరీ అయ్యిందని తెలుస్తుంది. Waltair Veerayya Collections.

మొదట రిలీజ్‌ అయిన `వీరసింహారెడ్డి` కలెక్షన్లు డ్రాప్‌ అవుతున్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాత `వాల్తేర్‌ వీరయ్య`, `వారసుడు` చిత్రాలు రిలీజ్‌ కావడంతో అది థియేటర్ల పరంగా `వీరసింహారెడ్డి`కి దెబ్బ పడింది. అతి హింసా దీనికి మైనస్‌గా మారింది. చిరంజీవి సినిమాలో వినోదం కలిసొచ్చింది. దీంతో బాక్సాఫీసు వద్ద డామినేషన్‌ కనిపిస్తుంది. `వీరసింహారెడ్డి` కంటే వాల్తేర్‌ వీరయ్యకి తక్కువ థియేటర్లే కేటాయించినా కలెక్షన్లు ఎక్కువగా రావడం విశేషం. 
 

click me!