కుర్ర హీరోయిన్ నేహా శెట్టి సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ గ్లామర్ ఫొటోలను పంచుకుంటూ నెటిజన్లను మైమరిపిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ చీరకట్టులో దర్శనమిచ్చి కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేసింది.
నేహా చివరిగా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఫిల్మ్ ‘డీజే టిల్లు’తో మంచి ఫేమ్ దక్కించుకుంది. సినిమా హిట్ కావడంతో నేహాకూ యూత్ లో మంచి ఫాలోయింగ్ పెరిగింది. మరోవైపు సినిమాలో అద్భుతమైన పెర్ఫామెన్స్ నూ కనబరిచి ఆడియెన్స్ ను కట్టిపడేసింది.
అలాగే గ్లామర్ ట్రీట్ తోనూ వెండితెరపై సందడి చేసింది. ప్రస్తుతం తన రాబోయే చిత్రాలపై ఫోకస్ పెట్టిందీ బ్యూటీ. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో తన అభిమానులకు టచ్ లోనే ఉంటోంది. బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో అదరగొడుతోంది.
సంక్రాంతి పండుగ సందర్భంగా నేహా శెట్టి చీరకట్టులో దర్శనమిచ్చింది. క్రీమ్ కలర్ శారీ, స్లీవ్ లెస్ బ్లౌజ్ లో అందాలను ఆరబోసింది. మత్తు చూపులు, మతిపోయే పోజులతో కుర్ర గుండెల్ని పేల్చేసింది. ఈ ఫొటోలను పంచుకుంటూ తన ఫ్యాన్స్ కు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపింది.
లేటెస్ట్ ఫొటోలకు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతున్నావంటూ కామెంట్లు పెడుతున్నారు. ఆమె బ్యూటీని పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. పిక్స్ ను లైక్స్ చేస్తూ నెట్టింట వైరల్ చేస్తున్నారు.
ఇక నేహా శెట్టి తన తదుపరి చిత్రం ‘బెదురులంక2012’తో అలరించనుంది. ఈసారి ‘ఆర్ ఎక్స్ 100’ హీరో కార్తీకేయ సరసన ఆడిపాడుతోంది. విడుదలకు సిద్ధం అవుతున్న ఈ చిత్రం నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందుతున్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ దక్కుతోంది.