Anchor Rashmi Gautam, Nithiin
నితిన్ కి ప్రస్తుతం ఏమాత్రం కలసి రావడం లేదు. నితిన్ నటించిన చిత్రాలు వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి. రీసెంట్ గా వచ్చిన రాబిన్ హుడ్ కూడా ఫ్లాప్ దిశగానే పయనిస్తోంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ నటించిన రెండవ చిత్రం ఇది. భీష్మ మ్యాజిక్ రిపీట్ అవుతుందని ఆశించిన ఫ్యాన్స్ కి నిరాశ తప్పలేదు.
Nithiin
ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా నితిన్ ఓ ఛానల్ లో ఉగాది సెలెబ్రేషన్ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో నితిన్ యాంకర్ రష్మీ గౌతమ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్మీతో తనకు ఉన్న పరిచయం ఇప్పటిది కాదని నితిన్ అన్నారు. తేజ దర్శకత్వంలో 2002లో నితిన్ జయం చిత్రంతో హీరోగా పరిచయం అయ్యారు. డైరెక్టర్ తేజ కొత్త నటీనటులకు ప్రాధాన్యత ఇస్తారు.
ఉదయ్ కిరణ్, సదా, నితిన్ లాంటి నటుల్ని ఇండస్ట్రీకి పరిచయం చేసింది డైరెక్టర్ తేజనే. నితిన్ తో జయం చిత్రం చేస్తున్నప్పుడు కొత్త హీరోయిన్ కోసం చాలా వెతికారట. ఈ విషయాన్ని నితిన్ స్వయంగా చెప్పారు. అప్పట్లో రష్మీ గౌతమ్ ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. ముందుగా రష్మీని హీరోయిన్ గా అనుకున్నాం. చాలా సన్నివేశాలు రష్మీ, నేను కలసి రిహార్సల్స్ చేశాం అని నితిన్ తెలిపారు. కానీ చివరకి జయం చిత్రంలోకి సదా వచ్చింది.
రష్మీ కనుక జయం చిత్రం చేసి ఉంటే అప్పుడే పెద్ద స్టార్ అయిపోయేది అని నితిన్ తెలిపారు. ఆ తర్వాత ఉదయ్ కిరణ్ హోలీ మూవీలో రష్మీ నటించింది. అప్పటి నుంచి రష్మీ ఇండస్ట్రీలో చాలా ప్రయత్నాలు చేసింది కానీ వర్కౌట్ కాలేదు. చివరికి బుల్లితెరపై సెటిల్ అయింది. మధ్యలో కొన్ని బోల్డ్ మూవీస్ కూడా చేసింది.
Rashmi Gautam
నితిన్ చెప్పిన జయం సంగతులు మాత్రం షాకింగ్ అనే చెప్పాలి. దాదాపుగా 20 ఏళ్ళ పైగా రష్మీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నట్లే లెక్క. జయం చిత్రం మిస్ కావడం నిజంగా రష్మీ దురదృష్టమే అని నెటిజన్లు అంటున్నారు.