నాని హీరోయిన్ కు లక్కీ ఛాన్స్.. పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్.. డిటేయిల్స్

First Published | Apr 11, 2023, 1:05 PM IST

టాలీవుడ్ లో రూపుదిద్దుకోనున్న భారీ ప్రాజెక్ట్ లో కన్నడ బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్ (Priyanka Arul Mohan) అవకాశం అందుకుంది.  ఏకంగా పవర్ స్టార్ ససన నటించే ఛాన్స్ దక్కించుకుంది.
 

కన్నడ బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్  నాని హీరోయిన్ గా అందరికీ పరిచయమే. ‘నానిస్ గ్యాంగ్ లీడర్’, ‘శ్రీకారం’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో టాలీవుడ్ లో మరో అవకాశం కోసం ఎదురుచూస్తోంది.
 

తాజా సమాచారం ప్రకారం.. ప్రియాంక మోహన్ కు తెలుగు చిత్ర పరిశ్రమలో భారీ ఆఫర్ దక్కిందని తెలుస్తోంది. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో తెరకెక్కబోతున్న OG చిత్రం క్యాస్ట్ గా ఎంపికైందని సినీ వర్గాల నుంచి సమాచారం. 
 


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. త్వరలో రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందించబోతున్నారు. 
 

ఇటీవల పవన్ కళ్యాణ్ కుర్ర హీరోయిన్లకు అవకాశాలు ఇస్తున్న విషయం తెలిసిందే. ‘వినోదయ సీతమ్’లో, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాల్లో  యంగ్ బ్యూటీలు మెరియబోతున్నారు. ఈక్రమంలో పవన్ - సుజీత్ కాంబోలోని ‘ఓజీ’కి హీరోయిన్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది.
 

అందం, నటనలో ప్రేక్షకులను మెప్పించిన  ప్రియాంక మోహన్ Original Gangstarలో పవన్ సరసన నటించే ఛాన్స్ దక్కించుకుందని తెలుస్తోంది.  ఈ బ్యూటీకి సరైన హిట్లు లేవు. ఇలాంటి సమయంలో పవర్ స్టార్ సరసన ఛాన్స్ దక్కడం ఆమె కేరీర్ మంచి బూస్ట్ నిస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. 
 

గతేడాది తమిళ స్టార్స్ సూర్య నటించిన ‘ఈటీ’, శివకార్తీకేయ  నటించిన ‘డాన్’ చిత్రాలతో ప్రియాంక హీరోయిన్ గా అలరించింది. ప్రస్తుతం ‘కెప్టెన్ మిల్లర్’, తమిళ దర్శకుడు ఎం. రాజేష్ దర్శకత్వం వహిస్తున్న ఓ చిత్రంలోనూ నటిస్తూ ఉంది.  ఇలోగా పవన్ కళ్యాణ్ చిత్రంలో అవకాశం దక్కించుకుందనడం ఆసక్తికరంగా మారింది.
 

Latest Videos

click me!