ముకుందని మందలిస్తాడు మురారి. మేడం మీకు కావాలంటే ఇక్కడ సపరేటు రూమ్స్ కూడా ఉన్నాయి కావాలంటే కర్టెన్ వేసేస్తాను అంటాడు వెయిటర్. ఏం మాట్లాడుతున్నావు అంటూ వెయిటర్ కాలర్ పట్టుకుంటాడు మురారి. అందరూ చూస్తున్నారు వదిలేయమంటుంది ముకుంద. అతనిని వదిలేసిన మురారి అందుకే నీతో బయటికి రాను పబ్లిక్ న్యూసెన్స్ ఎందుకని అతనిని వదిలేసాను అంటాడు మురారి. ఇంతలోనే స్వీట్ తీసుకుని వస్తాడు వెయిటర్. ముకుంద, మురారి కి తినిపించబోతే ఇంక ఆటలు చాలు ఇలా చేయడం నావల్ల కాదు అంటాడు మురారి.