Ennenno Janmala Bandham: కోపంతో రగిలిపోతున్న వసంత్.. వేదతో కన్నీరు పెట్టించిన ఆదిత్య?

Published : Jun 13, 2023, 11:38 AM IST

Ennenno Janmala Bandham: స్టార్ మా లో ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ మంచి కథ కథనాలతో మంచి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. తనని చేరదీసిందన్న విశ్వాసం లేకుండా తన సవతి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్న ఒక ఆడదాని కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూన్ 13 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.  

PREV
110
Ennenno Janmala Bandham: కోపంతో రగిలిపోతున్న వసంత్.. వేదతో కన్నీరు పెట్టించిన ఆదిత్య?

ఎపిసోడ్ ప్రారంభంలో కొడుకుని బాగా చూసుకుంటానని చెప్పి తీసుకొని వెళ్లావు ఈరోజు నీతో పాటు వాడిని కూడా కష్టాలపాలు చేశావు ప్రశాంతంగా పడుకోవలసిన వాడు నిద్ర పట్టక భయంతో వణికిపోతున్నాడు ఇదంతా నీ వల్లే అంటూ మాళవికకి చివాట్లు పెడతాడు యష్. నాకు తెలుసు ఇలాగే మాట్లాడుతారని నేను రావడం మీకు ఇష్టం లేదు అంటుంది మాళవిక.

210

నిజంగానే ఇష్టం లేదు వేద చెప్పిందని నేను ఇక్కడికి తీసుకువచ్చాను. ఇప్పటివరకు అయ్యింది చాలు ఇకనైనా నీకోసం కాకుండా నీ కొడుకు భవిష్యత్తు కోసం బ్రతుకు అంటాడు యష్. అంతలోనే అక్కడికి వచ్చిన వేద ఏం మాట్లాడుతున్నారు మీ మాటలు బయటికి వినిపిస్తున్నాయి అయినా ఈ టాపిక్ మాట్లాడొద్దని చెప్పాను కదా అంటుంది.

310

రాత్రి వాడి పరిస్థితి చూసి కూడా ఎలాగా మాట్లాడకుండా ఉంటాను అంటాడు యష్. అతనికి నచ్చజెప్పి పంపించేస్తుంది వేద. ఆయన మాటలు పట్టించుకోకు అయినా రాత్రి ఆదిత్య చాలా లేట్ గా పడుకున్నాడు కాసేపు పడుకోని అని చెప్పి మాళవిక ని తీసుకొని వెళ్ళిపోతుంది వేద. సీన్ కట్ చేస్తే మాలిని దంపతులు సులోచన దంపతులు మాళవిక గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.

410

ఇంతలోనే వసంత్ దంపతులు వచ్చి అందరిని పలకరిస్తారు. అందరి కోసం గిఫ్ట్లు తెస్తారు వసంత్ వాళ్లు. అందరికీ ఇచ్చాను కదా ఇంకెవరికి మిస్ అవ్వలేదు కదా అంటాడు వసంత్. అంతలోనే డోర్ తీసుకొని బయటికి వచ్చిన మాళవికను చూసి షాక్ అవుతాడు. నువ్వేంటి ఎక్కడున్నావు అని మాళవిక అని అడుగుతాడు. జరిగిందంతా చెప్తుంది వేద.
 

510

 కోపంతో రగిలిపోయిన వసంత్ అభి అంతు చూస్తాను అంటాడు. ఈ ఆవేశమే వద్దనేది అందుకే నువ్వు ఫోన్ చేసినా కూడా నీకు విషయం చెప్పలేదు అంటుంది వేద. అవును ఇప్పుడు ఏం చేసినా లాభం లేదు ఆల్రెడీ వేరే పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడ అందరికీ భారంగా బ్రతుకుతున్నాను ఇప్పుడు నువ్వు వచ్చావు కదా మీ దగ్గరికి వచ్చేస్తాను. తర్వాత మంచి ఉద్యోగం చూసుకొని వేరే ఇంటికి వెళ్ళిపోతాను అంటుంది మాళవిక.
 

610

నువ్వెందుకు అక్కడికి అని చికాగ్గా అంటుంది మాలిని. మాళవిక ఎక్కడ బాధపడుతుందో అని కొత్తజంటకి ప్రైవసీ అవసరం కదా అందుకే అత్తయ్య అలా అంటున్నారు అని సర్ది చెప్తుంది వేద. సరే ఇప్పుడే వచ్చారు కదా వెళ్లి రెస్ట్ తీసుకోండి అని మాలిని అనటంతో చిత్ర దంపతులు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. మరోవైపు కూతురితో సరదాగా కబుర్లు చెబుతూ స్కూల్ కి రెడీ చేస్తూ ఉంటుంది వేద.
 

710

వాళ్ల క్లోజ్ నెస్ చూసి తట్టుకోలేక పోతుంది మాళవిక. వేద దగ్గరికి వెళ్లి నాకు ఒక చిన్న సాయం చేస్తావా అని అడుగుతుంది. తను పనిలో ఉంది కదా పోయి నువ్వే చేసుకో అంటుంది మాలిని. అలా కాదు అత్తయ్య తనని చెప్పనివ్వండి అంటుంది వేద. అది కాదు వేద అది తిని నేను నిద్ర లేపితే లేవడు. స్కూల్ కి వెళ్ళను అని మారం చేస్తాడు నువ్వు లేపితే లేస్తాడు కావాలంటే ఖుషి కి నేను జడవేస్తాను అంటుంది మాళవిక.
 

810

కొడుకుని అంత గొప్పగా పెంచావన్నమాట కానీ నిష్ఠూరమాడుతుంది మాలిని. మాళవిక మాటలకి సరే అని చెప్పి ఆదిత్యని లేపటానికి వెళుతుంది వేద. ఆదిత్య వేదని కసురుకుంటాడు నా దగ్గర నటించొద్దు మీరేమీ నాకు అమ్మ కాదు సవతి తల్లి మాత్రమే అయినా నేను ఇక్కడ గెస్ట్ ని  కొద్ది రోజులు ఉండి వెళ్ళిపోతాను. అయినా స్కూల్ కి వెళ్లడం వెళ్ళకపోవడం నా ఇష్టం.
 

910

ఈరోజు నాకు వెళ్లాలని లేదు తలనొప్పిగా ఉంది పడుకుంటాను మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి అంటూ కసురుకుంటాడు. వేద కన్నీరు పెట్టుకుంటూ బయటికి వస్తుంది. అంతలోనే అక్కడికి వచ్చిన యష్ ఏం జరిగింది వాడు ఎందుకు అరుస్తున్నాడు బయటికి వినిపిస్తున్నాయి వాడి మాటలు అయినా నువ్వు ఇంత ప్రేమగా చూసుకుంటూ ఉంటే నీ మీదే కేకలు వేస్తాడా అంటూ కోపంగా ఆదిత్య దగ్గరికి వెళ్లబోతాడు యష్.
 

1010

యష్ ని మందలించి ఆదిత్య ఉన్న పరిస్థితి అలాంటిది తనని ఏమీ అనకండి అని ఆదిత్య ని వెనకేసుకొస్తుంది వేద. తరువాయి భాగంలో పేద దంపతులు ఇద్దరు లావై పోతున్నారు అంటూ ఒకరిని ఒకరు ఆటపట్టించుకుంటూ ఉంటారు. ఆ సమయంలోనే కళ్ళజోడులో ఎలాంటి మ్యాజిక్ లేదని తెలుసుకుంటుంది వేద.

click me!

Recommended Stories