హైదరాబాద్ వీధుల్లో కీర్తిసురేష్ షికారు.. తందూరీ టీ తాగి.. ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసిన బ్యూటీ..

Published : Jun 13, 2023, 11:35 AM IST

సెలబ్రిటీ అయినా కూడా సామాన్యురాలిగా ఉండాలంటే అది కీర్తి సురేష్ కు మాత్రమే సాధ్యం. నిజంగా తాను స్పెషల్ అని నిరూపించుకుంది మలయాళ బ్యూటీ ఏం చేసిందంటే..? 

PREV
16
హైదరాబాద్ వీధుల్లో కీర్తిసురేష్ షికారు.. తందూరీ టీ తాగి.. ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసిన బ్యూటీ..

ఇక తాజాగా  దసరా సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసింది కీర్తి సురేష్. అచ్చమైన నాటు పల్లెటూరి పిల్లగా.. డీగ్లామర్ లుక్ లో..  ప్రేక్షకులను అలరించింది. సింగరేణి బ్యాప్‌డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమాలో కీర్తి.. సహజనటనతో.. మనసుదోచేసుకుంది. 

26
Keerthy Suresh

టాలీవుడ్ తో పాటు.. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో.. హీరోయిన్ కీర్తి సురేష్ కు ప్రత్యేక స్థానం ఉంది. సినీ ఇండస్ట్రీలో నటి కీర్తి సురేశ్ తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ ను సాదించింది. ముఖ్యంగా  మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్‌కు పెరిగిన క్రేజ్ అంతా ఇంతా కాదు.సౌత్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలుగుతోంది బ్యూటీ. 

36

అటు నాని నటనకు ఫుల్ మార్కులుపడగా.. అంతకు మించి కీర్తిసురేష్ మెప్పించిందిమార్కులు కొట్టేసింది. న దసరా మూవీలో కీర్తి నటనకు అభిమానులు ఫిదా అయ్యారు.  దీని తర్వాత వరుస షూటింగ్‌లతో బిజీగా అయింది ఈ అందాల భామ. తమిళంలో ఆమె నటించిన  మామన్నన్  సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. 
 

46
Keerthy Suresh

అంతే కాదు మెగాస్టార్ చిరంజీవితో భోళాశంకర్ సినిమాలో నటిస్తోంది బ్యూటీ. చిరంజీవికి చెల్లెలుగా కనిపించబోతోంది.  తమిళంలో సూపర్ హిట్ అయిన  వేదాళం  సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది. భోళాశంకర్. ఇక ఈమూవీ  షూటింగ్ హైదరాబాద్ సమీప ప్రాంతాల్లోనే జరిగింది. మెగాస్టార్‌ సరసన తమన్నా కనిపించబోతుంది. 

56
Keerthy Suresh

కీర్తి సురుష్ ఎంత బిజీగా ఉన్నా.. తన ఫ్యామిలీకి.. ఫ్రెండ్స్ కు టైమ్ పక్కాగా కేటాయిస్తుంది.  దీనికి సంబంధించిన ఫొటోలు కీర్తి సురేశ్ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఎవరు గుర్తుపట్టకుండా మాస్క్ ధరించింది.  తన స్నేహితులతో కలిసి తిరిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 

66

ఈ సందర్భంగా షూటింగ్ కోసం హైదరాబాద్‌కు వచ్చిన కీర్తి..షూటింగ్  కంప్లీట్ అవ్వగానే కొంటె పనులు మొదలు పెట్టిందట. కీర్తి తన ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా హైదరాబాద్ లో  తిరిగారు.  గచ్చిబౌలిలోని ఓ టిఫిన్ సెంటర్‌లో టిఫిన్ చేసి, ఫ్రెండ్స్‌తో కలిసి తందూరీ టీ తాగి ఎంజాయ్ చేసింది.

Read more Photos on
click me!

Recommended Stories