ఈరోజు ఎపిసోడ్ లో వేద, ఆదిత్య కార్ కీస్ ఇలా ఇవ్వు చిన్న పిల్లలు కార్ డ్రైవ్ చేయకూడదు అనడంతో వెంటనే ఆదిత్య నేను ఇవ్వను మా ఫ్రెండ్స్ ముందు కార్ డ్రైవ్ చేయాలి అని మొండి పట్టి పడతాడు. అప్పుడు ఆదిత్య చెంప చెల్లుమనిపిస్తుంది వేద. అప్పుడు ఆదిత్య నన్నే కొడతారా మా మమ్మీకి చెబుతాను ఉండు అని అక్కడ నుంచి పరిగెడతాడు. ఇంతలో కార్ డ్రైవర్ ఎక్కడికి రావడంతో అడగ్గానే అలా కార్ కీస్ ఇచ్చేయడమేనా ఏదైనా జరగరానిది ఏదైనా జరిగితే అప్పుడు ఏంటి అని అనగా ఇప్పుడు మీరు కొట్టిన దెబ్బ వాళ్ళ అమ్మ ఎప్పుడో కొట్టి ఉంటే ఈ పిల్లాడు ప్రవర్తించేవాడు కాదు మీ అమ్మకు యాక్సిడెంట్ జరిగేది కాదు అనడంతో వేద షాక్ అవుతుంది.