ప్రేమకు వయసు లేదంటారు. అది ఎప్పుడు ఎవరిపైకి మళ్లుతుందో చెప్పలేం. వయసొచ్చాక అమ్మాయిలు కలలు కనడం స్టార్ట్ చేస్తారు. తమ యువరాజు ఇలా ఉండాలి అంటూ ఊహల్లో విహరిస్తూ ఉంటారు. కులం-మతం, పేద-గొప్ప, చిన్న-పెద్ద అనే తారతమ్యాలు లేకుండా ప్రేమ చిగురిస్తుంది. కాగా కొందరు హీరోయిన్స్ చిన్న వయసులోనే ప్రేమలో పడ్డట్లు ఒప్పుకున్నారు.