అప్పుడు వేద ధైర్యం తెచ్చుకొని నా చేతుల్లో నుంచి ఆ మాళవికను ఎవరు కాపాడలేరు అని ధైర్యంగా మాట్లాడడంతో ఝాన్సీ, మాలిని ఇద్దరు సంతోషపడుతూ ఉంటారు. మరొకవైపు ఆదిత్య దేవుడి దగ్గరికి వెళ్లి మా మమ్మీకి నేనంటే చాలా ఇష్టం మా మమ్మీని కాపాడు స్వామి అని కోరుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత మాలిని సులోచన అందరు కలిసి కోర్టుకు వెళ్తారు. అప్పుడు సులోచన టెన్షన్ పడుతూ ఉండగా మాలిని ధైర్యం చెబుతుంది. ఇంతలో అక్కడికి యష్ వచ్చి మాళవిక పక్కలో కూర్చోవడంతో మాలిని కోపంతో రగిలిపోతుంది. ఇంతలోనే అక్కడికి జడ్జ్ వస్తాడు.