Ennenno Janmala Bandam: బెస్ట్ డాక్టర్ అవార్డు సొంతం చేసుకున్న వేద.. కూతురిని దగ్గరికి తీసుకున్న యష్!

Published : Mar 29, 2022, 12:05 PM IST

Ennenno Janmala Bandam: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం (Ennenno Janmala Bandam) సీరియల్ ప్రేమ యొక్క గొప్పతనం అనే నేపథ్యంలో కొనసాగుతుంది. కాగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

PREV
16
Ennenno Janmala Bandam: బెస్ట్ డాక్టర్ అవార్డు సొంతం చేసుకున్న వేద.. కూతురిని దగ్గరికి తీసుకున్న యష్!

వేద (Vedha) మీలాంటి కసాయి తండ్రి నుంచి కాపాడడానికి ఖుషి కి నేనున్నాను అని యష్ ను అనరాని మాటలు అంటుంది. యష్ (Yash) అవేమీ పట్టించుకోకుండా దీనంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక వేద ఇంత మాట్లాడిన కూడా మనిషి కదలడం లేదు మెదలడం లేదు ఏంటి అని అనుకుంటుంది.
 

26

మరోవైపు ఖుషి (Khushi) బాధ పడుతూ ఉండగా వేద (Vedha) అక్కడికి వెళ్లి మీ డాడీకి నువ్వంటే చాలా ఇష్టం. కానీ ఆఫీసులో ఏదో జరగడం వల్ల మూడ్ బాలేక నీ మీద చిరాకు పడ్డారు అని కవర్ చేస్తుంది. అంతే కాకుండా సారీ కూడా చెప్పారు అని యష్ ను కాపాడుతుంది. దాంతో ఖుషి ఎంతో ఆనంద పడుతుంది.
 

36

అదే క్రమంలో ఖుషి (Khushi) ను ఇంతగా ఇష్టపడే యష్ ఉన్నట్టుండి ఇలా ప్రవర్తించడానికి కారణం ఏమిటి అని వేద ఆలోచిస్తుంది. మరోవైపు అభిమన్యు దంపతులు స్పెషల్ సాంగ్ తో చిల్ అవుతూ ఉంటారు. ఇక ఉదయాన్నే వేద యష్ (Yash) కు వార్నింగ్ ఇస్తుంది.
 

46

ఇక యష్ (Yash) ఖుషిను కారులో స్కూల్ కి తీసుకొని వెళుతుండగా ఖుషి (Khushi) డాడీ మీరు అంటే నాకు భలే ఇష్టం అని చెబుతుంది. అంతే కాకుండా ఐ లవ్ యు డాడీ అని చెబుతుంది. దాంతో యష్ సారీ అమ్మా అని దగ్గరకు తీసుకుంటాడు. ఆ క్రమంలో తండ్రి కూతుర్లు ఎంతో ఎమోషనల్ అవుతారు.
 

56

ఇక యష్ (Yash)  ఆ అభిమన్యు గాడు తాగి వాగిన మాటలు నేను పట్టించుకోవడం ఏమిటి అని తనకు తాను సమర్థించుకుంటాడు. అంతేకాకుండా ఖుషి (Khushi)  ముమ్మాటికి నా కూతురు అని గట్టిగా అనుకుంటాడు. ఆ తర్వాత వేదకు బెస్ట్ డాక్టర్ అవార్డు కు ఎంపికైనట్టు ఫోన్ వస్తుంది. దాంతో వేద ఎంతో సంతోషిస్తుంది.
 

66

ఇక ఈ విషయాన్ని వేద యష్ (Yash) కి ఫోన్ చేసి  చెబుతుంది. ఇక యష్ నువ్వు పిచ్చి దానివి నీకెవరు అవార్డ్ ఇస్తారు అని అంటారు. ఇక వేద (Vedha) యష్ పై కోపడుతుంది. ఇక ఈ క్రమంలో రేపటి భాగంలో ఎం జరుగుతుందో చూడాలి.

click me!

Recommended Stories