ఇదిలా ఉంటే ముచ్చటగా మూడో జంట అవతరించింది. జోర్దార్ సుజాత-రాకింగ్ రాకేష్ మధ్య కొన్నాళ్లుగా లవ్ ట్రాక్ నడుస్తుంది. అనేక బుల్లితెర షోలలో వీరిద్దరూ ప్రేమికులుగా షోలు చేస్తున్నారు. ఇక లేటెస్ట్ ఎపిసోడ్ లో ఈ జంట మధ్య భావోద్వేగ సన్నివేశం చోటు చేసుకుంది. రాకేష్ ఎంత సంపాదిస్తున్నాడు, అతని వెనుక ఏముంది అనేది నాకు అనవసరం. రాకేష్ నాతో ఉంటే చాలు అని చెప్పింది సుజాత.