Ennenno Janmala Bandham: భయంతో వణికిపోతున్న ఆదిత్య.. మాళవికకు సలహా ఇస్తున్న వేద?

Published : Jun 12, 2023, 11:40 AM IST

Ennenno Janmala Bandham: స్టార్ మా లో ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ మంచి టిఆర్పి రేటింగ్ తో సక్సెస్ఫుల్ గా ముందుకి దూసుకుపోతుంది. తల్లిదండ్రుల జగడాల మధ్య నలిగిపోతున్న ఒక కొడుకు కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూన్ 12 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.  

PREV
17
Ennenno Janmala Bandham: భయంతో వణికిపోతున్న ఆదిత్య.. మాళవికకు సలహా ఇస్తున్న వేద?

 ఎపిసోడ్ ప్రారంభంలో ఒంటి చుట్టూ దుప్పటి కప్పుకొని ఇలాంటి పనులు చేస్తున్నారేంటి  ఎందుకిలా చేస్తున్నారు అంటుంది వేద. ఎన్ని దుప్పట్లు కప్పుకున్నా ఈ కళ్ళజోడు ముందు ఏదీ ఆగదు అంటాడు యష్. వాష్ రూమ్ లోకి వెళ్లి తలుపు వేసుకుంటుంది వేద. ఎంతసేపు బాత్రూంలో ఉంటావు బయటికి రా అంటాడు యష్. నేను రాను.. అయినా ఎంతో డిగ్నిటీగా ఉండవలసిన మీరు ఇలా చేస్తున్నారు అంటుంది వేద.
 

27

 డిగ్నిటీగా ఉండడానికి నేనేమైనా ఆఫీసులో ఉన్నానా.. నా రూమ్ లో నా భార్యతో ఉన్నాను ముందు బయటికి రా అంటాడు యష్. ముందు ఆ కళ్ళజోడు తీసేయండి అప్పుడు వస్తాను అంటుంది వేద. అందాలని అందంగా చూపించే ఇలాంటి వాటిని పారేసుకోకూడదు బంగారం అయినా రాత్రంతా అక్కడే ఉంటావా అంటాడు యష్. అవును అంటుంది వేద. అదే సమయంలో తల్లి మాటలు తలుచుకొని భయంతో వణికి పోతుంటాడు ఆదిత్య.
 

37

 నాకు భయంగా ఉందమ్మా అంటూ కలవరిస్తూ మంచం దిగి బయటకు వెళ్లి అక్కడ పడుకుంటాడు. మరోవైపు రాత్రి 12:00 అయిన తర్వాత బయటినుంచి సౌండ్స్ రావటం లేదేంటి మా శ్రీవారు పడుకున్నారా అనుకుంటూ డోర్ ఓపెన్ చేస్తుంది వేద. నిద్రలో ఉన్న భర్తను చూసి హమ్మయ్య పడుకున్నారు అనుకుంటూ బయటకు వస్తుంది. ఆ కళ్ళజోడు కోసం వెతుకుతుంది కానీ ఎక్కడా కనిపించదు.
 

47

అదే సమయంలో మెలకువ వచ్చిన  ఖుషి కి పక్కన ఉన్న అన్నయ్య  లేకపోవడంతో కంగారుగా అంతా వెతుకుతుంది. అన్నయ్య.. అని పిలుస్తూ హాల్లోకి వస్తుంది. సరిగ్గా అప్పుడే వేద కూడా మంచినీళ్లు తాగటానికి బయటకు వస్తుంది. ఖుషి ని  చూసి ఏమైంది అని అడుగుతుంది. అన్నయ్య మంచం మీద లేడమ్మ నా గదిలో పడుకోవటం ఇష్టం లేనట్లుగా ఉంది ఎందుకు నేనంటే అన్నయ్యకి అంత కోపం అంటుంది ఖుషి.
 

57

అలాంటిదేమీ లేదు..అన్నయ్యని నేను వెతికి తీసుకు వస్తాను అని కూతురికి సర్ది చెప్పి పడుకోబడుతుంది వేద. ఆ తర్వాత ఆదిత్య ని వెతుకుతుంటే బయట పడుకొని వణికిపోతూ కనిపిస్తాడు ఆదిత్య. షాక్ అవుతుంది వేద. ఆదిత్యని దగ్గరికి తీసుకొని ఏం జరిగింది అని అడుగుతుంది. నాకు చాలా భయంగా ఉంది ఊపిరి ఆడటం లేదు  అంటాడు ఆదిత్య.
 

67

అలా అయితే మీ నాన్నగారికి చెప్పాలి లేకపోతే నాకు చెప్పాలి అంతేకానీ ఇలా ఒంటరిగా ఉండడం ఏంటి అని చెప్పి ఊళ్లో పడుకోబెట్టుకొని జోలపాడి నిద్రపుచ్చుతుంది వేద. ఆ తర్వాత ఆదిత్య ని తీసుకువచ్చి వాళ్ళిద్దరి మధ్యలో పడుకోబెట్టుకుంటుంది. ఆ డిస్టబెన్స్ కి మెలుకువ వచ్చి చూస్తాడు యష్. వేద ద్వారా జరిగింది తెలుసుకొని కొడుకు పరిస్థితికి బాధపడతాడు. కొడుకుని తనకు దగ్గర చేస్తున్నందుకు వేదకి థాంక్స్ చెప్తాడు యష్.మరుసటి రోజు ఉదయాన్నే కొడుకుని వెతుక్కుంటూ వస్తుంది మాళవిక. వేద కనిపిస్తే ఆదిత్య గురించి అడుగుతుంది. 

77

రాత్రి జరిగింది చెప్తుంది వేద. పిల్లల ప్రవర్తనకి పెద్దవాళ్లే కారణం పరిస్థితులు ఎలా ఉన్నా ఆదిత్య ముందు నువ్వు సంతోషంగా ఉండేలాగా చూసుకో అంటూ సలహా ఇస్తుంది వేద. వాడు ఇంకా డిస్టర్బ్ అవ్వాలి ఆ డిస్టబెన్స్ మీ ఇద్దరి మధ్యలో డిస్టబెన్స్ క్రియేట్ చేయాలి అలా జరగాలంటే నా కొడుక్కి ఇంకొంచెం కీ ఇవ్వాలి అని మనసులో అనుకుంటుంది మాళవిక. బయటికి మాత్రం అలాగే అని చెప్పి కొడుకుని లేపటానికి యష్ రూమ్ కి వెళుతుంది. అప్పుడే కళ్ళు తెరిచిన యష్ ఫస్ట్ వేద మొహం చూడాలనుకుంటాడు కానీ మాళవిక మొహం కనిపించడంతో చిరాకు పడతాడు.

click me!

Recommended Stories