సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో తెరకెక్కిన ప్రేమించు హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రేమించు లో లయ అంధురాలు పాత్ర చేశారు. హనుమాన్ జంక్షన్, నువ్వులేక నేనులేను వంటి కమర్షియల్ హిట్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి. ఇండస్ట్రీలో ఉంది కొద్ది రోజులే అయినా 50 కి పైగా చిత్రాల్లో లయ నటించారు.