ఈరోజు ఎపిసోడ్లో వేద, యష్ కోసం భోజనం తీసుకుని వస్తుంది. వేదని చూసిన యష్ రా వేద అని అనగా అప్పుడు వేద అత్తయ్య గారు మీకోసం లంచ్ పంపించారు అని అంటుంది. థాంక్స్ లేదా సరే కూర్చో ఇద్దరం కలిసి భోజనం చేద్దాం అని అనడంతో లేదు నేను క్లినిక్ కి వెళ్తున్నాను అని అంటుంది వేద. ఆ తర్వాత వేద అత్తయ్య గారితో మధ్యాహ్నం ఒకసారి భోజనం చేసి మాట్లాడండి చాలా బాధపడుతున్నారు మీ విషయంలో అని అక్కడి నుంచి వెళ్తుండగా ఇంతలో వేద అని పిలుస్తాడు. అప్పుడు యష్ అసలు విషయం చెప్పబోతుండగా వేద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు వెనకాలే వెళ్లి యష్ ఏంటి నువ్వు చేస్తున్న పని అని అంటాడు.