సినిమాల్లోకి దిల్ రాజు భార్య, కోట్లు ఖర్చు చేయబోతున్న స్టార్ ప్రొడ్యూసర్..?

First Published | Nov 23, 2022, 12:12 PM IST

ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వారసులు ఎంట్రీలు ఎప్పుడూ ఉండేవే.. కాని ఈమధ్య అవి ఎక్కువైపోయి.. ఈక్రమంలో వారసుల తో పాటు స్టార్ల భార్యలు కూడా ఇండస్ట్రీపై కన్నేస్తున్నారు. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భార్య ఇండస్ట్రీ ఎంట్రి ఇవ్వబోతుందటూ.. వార్తలు హల్ చల్ చేస్తున్నాయి ఇందులో నిజమెంత...? 
 

ఇప్పటికే ఫిల్మ్ ఇండస్ట్రీ కుటుంబవారసత్వాలతో నిండిపోయింది. వాళ్లే స్టార్లు అవుతున్నారు. బయట నుంచి వచ్చి స్టార్స్ గా ఎదగడం అంటే అంత ఈజీ కాదు. విజయ్ దేవరకొండ లాంటి కొంత మందికే అది సాధ్యం అయ్యింది. అయితే ఈ మధ్య సెలబ్రిటీల కొడుకులు, కూతుర్లతో పాటు.. వారిభార్యలు కూడా సినిమాలపై కన్నేస్తున్నారు. ఈక్రమంలోనే స్టార్ ప్రొడూసర్ దిల్ రాజు భార్య సినిమాల్లోకి రాబోతున్నట్టు తెలుస్తోంది. 

కాగా దిల్ రాజు రెండోవ భార్య తేజస్విని కోసం కోట్లు ఖర్చు పెట్టడానికి రెడీ అయ్యాడట. ఆమెకు చాలా కాలంగా ఉన్న కోరిక తీర్చడానికి దిల్ రాజు కోట్లు పెట్టుబడిగా పెట్టబోతున్నట్టు సమాచారం. దీనికి సబంధించి ఓ  క్రేజీ రూమర్ సోషల్ మీడియాలో టాప్ రేంజ్ లో దూసుకుపోతుంది. 
 


దిల్ రాజు కంటే చాలా చిన్నదైన  తేజస్విని మోడలింగ్ చేయాలని ఎప్పటి నుంచో కోరిక ఉందట. యాక్టింగ్ అంటే కూడా చాలా ఇష్టమట ఆమెకు.  చాలా చిన్నది . దిల్ రాజు కన్నా డబుల్ చిన్న వయసు. ఫస్ట్ నుంచి తేజస్వినికి యాక్టింగ్ అంటే చాలా ఇష్టమట. ఈ క్రమంలోనే మోడలింగ్ చేయాలని చాలా ట్రై చేసిందట .

కానీ ఫ్యామిలీలో ఇటువంటివి ఒప్పుకోకపోవడంతో.. ఆ కోరికను చంపేసకుందట తేజస్వీని.. అయితే ఈ విషయం పెళ్లి తరువాత తన భర్తకు చెప్పడంతో దిల్ రాజు ఈ విషయంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.  ఇక తేజస్విని మోడలింగ్ రంగంలో దించడానికి అన్ని ప్లాన్స్ అమలు చేశారని.. దీని కోసం ఆయన ఏకంగా కోట్లు ఖర్చు చేసి ఆమెను మోడలింగ్ రంగంలోకి దింపుతున్నాడని తెలుస్తుంది . 

అంతేకాదు అన్ని కుదిరితే దిల్ రాజు భార్య హీరోయిన్ గా కాని.. ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ రోల్స్  చేయడానికి కాని ఫిల్మ్స్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నట్ట తెలుస్తోంది.  ప్రస్తుతం ఈ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో  వైరల్ గా మారింది . దీంతో ట్రోలరస్ నువ్వు నిజమైన హస్బెండ్ వింటూ ఆయన ను ఓ రేంజ్ లో వ్యంగ్యంగా ట్రోల్ చేస్తున్నారు.
 

ఇక దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. డిస్టీబ్యూటర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన దిల్ రాజు.. అంచలంచెలుగా ఎదిగి టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ గా మారారు.  సినిమా కథ విషయంలో కాని.. సక్సెస్ విషయంలో కాని ఆయన అంచనాలు పర్ఫెక్ట్ గా నిజం అవుతాయన్న పేరు ఉంది.

అందుకే ఆయన ఈ రేంజ్ కు వచ్చాడంటారు.  ఇండస్ట్రీలో ఏది ఎప్పుడు జరగాలి అనేది శాసించేంత స్థాయికి దిల్ రాజు ఎదిగారు. ఇప్పుడు పాన్ ఇండియాను కూడా టార్గెట్ చేశారు. 

ఇక దిల్ రాజు ప్రేమించిన భార్య అనారోగ్యంతో మరణించడంతో.. ఆయన కూతురు దిల్ రాజుకు 50 ఏళ్ల వయస్సులో మళ్లీ పెళ్లి చేసింది. 
 

Dil Raju

ఇక దిల్ రాజు దంపతులకు రీసెంట్ గా వారసుడు జన్మించగా.. బాబుతో దిల్ రాజు దిగిన ఫోటోస్ సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి. ఇక ఈ క్రమంలోనే దిల్ రాజు భార్య తన మోడలింగ్ కోరికను తీర్చుకోబోతున్నట్టు తెలుస్తోంది. 
 

Latest Videos

click me!