ఆమె జీవితంలో ఇది ఒక దశ మాత్రమే ...సమంత మయోసైటిస్ వ్యాధిపై శ్రియ శరన్ కామెంట్స్!

Published : Nov 23, 2022, 11:57 AM IST

తాజాగా హీరోయిన్ శ్రియ శరన్  సమంత ఆరోగ్యంపై స్పందించారు. ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... సమంత చాలా మంచి వ్యక్తి. అలాగే ఆమె స్ట్రాంగ్ గర్ల్. ఇది ఆమె జీవితంలో చిన్న దశ మాత్రమే. సమంత ఈ రుగ్మతను ఎదిరించి స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇస్తుంది. సమంత తిరిగి కోలుకుంటుందని చెప్పుకొచ్చారు.

PREV
16
ఆమె జీవితంలో ఇది ఒక దశ మాత్రమే ...సమంత మయోసైటిస్ వ్యాధిపై శ్రియ శరన్ కామెంట్స్!
Samantha

సమంత తన ఆరోగ్యం గురించి చేసిన ప్రకటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అరుదైన మయోసైటిస్ తో బాధపడుతున్నట్లు సమంత సోషల్ మీడియా సందేశం ద్వారా తెలియజేయగా ఫ్యాన్స్ ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. తాజాగా శ్రియా శరన్ సమంత ఆరోగ్యంపై స్పందించారు. 
 

26


అక్టోబర్ 29న సమంత మయోసైటిస్ సోకినట్లు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. చేతికి సెలైన్ నీడిల్ తో ఉన్న సమంత ఫోటో దిగ్భ్రాంతికి గురి చేసింది. కండరాలకు సంబంధించిన ఈ రుగ్మత సమంతకు ఎలా సోకిందనే సందేహాలు మొదలయ్యాయి. సాధారణంగా మయోసైటిస్ చిన్న పిల్లలకు లేదా వయసులో పెద్ద వాళ్లకు మాత్రమే సోకుతుందనే వాదన ఉంది. కానీ యంగ్ ఏజ్ లో ఉన్న సమంత ఆ మహమ్మారి బారినపడటం దురదృష్టకరం. 
 

36


సమంతకు మయోసైటిస్ సోకిందని తెలిసిన చిత్ర ప్రముఖులు, అభిమానులు విచారం వ్యక్తం చేశారు. ఆమె త్వరగా కోలుకొని పూర్వ స్థితికి రావాలని కాంక్షించారు. చిరంజీవి, ఎన్టీఆర్ వంటి ప్రముఖులు సమంత ఆరోగ్యం పై స్పందించడం విశేషం. 
 

46

తాజాగా హీరోయిన్ శ్రియ శరన్ స్పందించారు. ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... సమంత చాలా మంచి వ్యక్తి. అలాగే ఆమె స్ట్రాంగ్ గర్ల్. ఇది ఆమె జీవితంలో చిన్న దశ మాత్రమే. సమంత ఈ రుగ్మతను ఎదిరించి స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇస్తుంది. సమంత తిరిగి కోలుకుంటుందని చెప్పుకొచ్చారు.

56


సమంత, శ్రియా మనం మూవీలో కలిసి నటించారు. నాగార్జునకు జంటగా శ్రియా నటించారు. నాగ చైతన్యతో సమంత జోడీ కట్టారు. మనం బ్లాక్ బస్టర్ విజయం సాధించిన విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్య మంచి స్నేహం కూడా ఉంది. తరచుగా కలుస్తారని సమాచారం. 
 

66


మరోవైపు సమంత లేటెస్ట్ మూవీ యశోద మంచి విజయం సాధించింది. లేడీ ఓరియెంటెడ్ మూవీతో కోట్లు కొల్లగొట్టిన సమంత ఔరా అనిపించింది. చాలా మంది హీరోల కంటే బెటర్ వసూళ్లు రాబట్టి తన ఫేమ్ ఏమిటో నిరూపించింది. సమంత ఓకే అంటే యశోద 2 సిద్ధంగా ఉందని మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం సమంత తెలుగులో శాకుంతలం, ఖుషి చిత్రాల్లో నటిస్తున్నారు. 

click me!

Recommended Stories