Ennenno janmala bandham: యష్ ను క్షమించమని అడిగిన వేద.. ఆమెకు అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చిన యశోదర్!

First Published | Feb 11, 2022, 3:36 PM IST

Ennenno janmala bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం (Ennenno janmala bandham) సీరియల్  ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇక పెళ్లి  ఆలస్యంగా వచ్చిన యశోదర్ ను వేద (Vedha) పక్కకు తీసుకువెళ్లి ' మీరు అసలు మనుషులేనా..  మీకు బుద్ధి జ్ఞానం ఉందా' అంటూ పలు మాటలతో విరుచుకు పడుతుంది.

ఇక ఆ తర్వాత యశోదర్ (Yasodhar) క్షమించమని అడిగి జరిగిన విషయమంతా చెబుతాడు. మరోవైపు మాళవిక అభిమన్యు దగ్గరికి వచ్చి వేద చేసుకోబోయే వ్యక్తి యశోదర్ కాదని చెబుతుంది.  దాంతో వారు ఇరువురు తెగ సంబరపడిపోతూ ఉంటారు. ఒక వైపు యశోధర్, వేద (Veda) లు పెళ్లి పీటల మీద కూర్చోడానికి సిద్ధంగా ఉంటారు.
 

ఇక ఉంగరాలు మార్చుకునే సమయం వస్తుంది. సులోచన (Sulochana)  సైడ్ నుంచి ఉంగరం సిద్ధంగా ఉండగా మాలిని వాళ్ళ తరుపున ఉంగరం తేవడం మర్చిపోతారు. ఇక దాంతో మాలినీ చేతికి ఉన్న ఉంగరం తీస్తుండగా ఈ లోపు  యశోదర్, ఖుషి (Yasodhar)  గిఫ్ట్ గా ఇచ్చిన రింగ్ ను జేబు లోంచి బయటకు తీస్తాడు.
 


ఇక ఆ ఉంగరం ఖుషి (Khusi) తయారుచేసి తనకు గిఫ్ట్ గా ప్రెజెంట్ చేసిన సంగతి  వేద కు చెబుతాడు. దాంతో వేద ఎంతో సంతోషిస్తుంది. ఇక ఒకరికి ఒకరు ఉంగరం మార్చుకునే క్రమంలో  యశోదర్ (Yashodar) కి ఇదివరకు మాళవిక తొడిగిన ఉంగరం చూసి వేద రింగ్ తొడగడానికి సందేహాస్తుంది.
 

ఇక యశోదర్ (Yasodhar) , మాళవిక చేదు జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకొని ఆ ఉంగరాన్ని  అక్కడే తీసి పారేస్తాడు. ఆ తర్వాత వేద మరో రింగ్ ను యశోధర వేలికి తొడుగుతుంది. ఆ తర్వాత యశోదర్ రింగ్ తోడుగుతున్న క్రమంలో ఖుషి లేదు అని ఆలోచిస్తూ ఉంటాడు. కానీ ఈలోగా అక్కడకు ఖుషి (Khushi) వచ్చి స్వయంగా యశోదర్ తో రింగ్ ను తొడిగిస్తుంది.
 

కానీ ఇందులో చెప్పాల్సిన విషయం ఏమిటంటే.. దానికి ఖుషి (Khusi) అక్కడకు రాదు. యశోదర్, వేద (Veda)   లు ఊహించుకుంటారు. ఇక ఆ తర్వాత  వీరిద్దరి మీద తలంబ్రాలు పడతాయి. దాంతో ఫ్యామిలీ అంతా ఆనందంతో చిందులు వేస్తూ ఉంటారు.
 

ఇక ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత వేద (Veda) కు యశోదర్  (Yasodhar) ఒక మాట చెబుతా అని తీసుకు వెళుతుండగా వేద ఫన్నీ గా నొ టచింగ్స్ అని  కండిషన్స్ పెడుతుంది. ఇక ఈ క్రమంలో రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.

Latest Videos

click me!