Pooja Family Vacation: ఈ సారి ఫ్యామిలీతో ఎంజాయ్‌ చేస్తున్న బన్నీ హీరోయిన్‌.. 13ఏళ్ల తర్వాత మమ్మీ కోసం అలా..

Published : Feb 11, 2022, 03:08 PM IST

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ పూజా హెగ్డే టైమ్‌ దొరికితే మాల్దీవుల్లో వాలిపోతుంది. బికినీ అందాల విందుతో అభిమానులకు విందు భోజనం పెడుతుంది. అయితే ఇప్పుడు మమ్మీ కోసం ప్లాన్‌ చేసింది. ఫాదర్‌పై ఫన్నీ కామెంట్‌ చేసింది. 

PREV
18
Pooja Family Vacation: ఈ సారి ఫ్యామిలీతో ఎంజాయ్‌ చేస్తున్న బన్నీ హీరోయిన్‌.. 13ఏళ్ల తర్వాత మమ్మీ కోసం అలా..

పూజా హెగ్డే గతేడాది నవంబర్‌ టైమ్‌లోనే వెకేషన్‌కి వెళ్లింది. దాదాపు వారం రోజులకుపైనే మాల్దీవుల్లో ఎంజాయ్‌ చేసింది. ఆ టైమ్‌లో బికినీ అందాలతో పూజా పంచుకున్న ఫోటోలు సామాజిక మాధ్యమాలను ఉలిక్కిపాటుకు గురిచేశాయి. మరోవైపు అభిమానులను అలరించింది. ఫుల్‌ మీల్స్ పెట్టిన ఫీలింగ్‌ పొందారు. పూజా కూడా అదే తరహాలో హాట్ హాట్‌ వీడియోలు, ఫోటోలు పంచుకుంటూ మెస్మరైజ్‌ చేసింది. 
 

28

తాజాగా మరోసారి వెకేషన్‌కి వెళ్లింది పూజా. అయితే ఇప్పుడు సింగిల్‌గా కాదు, ఫ్యామిలీతో కలిసి ఆమె మాల్దీవులకు చెక్కేయడం విశేషం. ప్రస్తుతం ఆయా పిక్స్ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఫ్యామిలీలో తన అమ్మా, నాన్న, సోదరుడు ఉండటం విశేషం. 

38

దాదాపు 13ఏళ్ల తర్వాత తన ఫ్యామిలీతో కలిసి పూజా వెకేషన్‌కి వెళ్లిందట. అంటే హీరోయిన్‌గా గుర్తింపు వచ్చిన తర్వాత ఆమె ఫ్యామిలీతో వెకేషన్‌కి వెళ్లలేదని తెలిపింది. అయితే ఈ సందర్భంగా మాత్రం ఓ స్పెషల్‌ అకేషన్‌ ఉంది. అది తన మమ్మీ పుట్టిన రోజు. ఈ విషయాన్ని పూజా తెలిపింది. ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో వారి ఫోటోలను పంచుకుంటూ ఆసక్తికర విషయాలను వెల్లడించింది. 

48

మాల్దీవుల్లో బోట్‌ వద్ద ఫ్యామిలీతో దిగిన ఫోటోని పంచకుంటూ లాంగ్‌ ఓవర్‌ డ్యూ అని పేర్కొంది. ఫ్యామిలీ, 13ఏళ్ల తర్వాత అవర్‌ ఫస్ట్ ఫ్యామిలీ వెకేషన్‌. కాలం చెల్లిపోయింది. ఇప్పుడు చాలా అవసరం అని చెబుతూ ఫ్యామ్‌జామ్‌ అని యాష్‌ ట్యాగ్‌ పంచుకుంది పూజా. ఫ్యామిలీతో జాలిగా ఎంజాయ్‌ చేస్తున్నామనే విషయాన్ని ఆమె వెల్లడించింది. అంతేకాదు తమని ఎవరూ డిస్టర్బ్ చేయోద్దని కూడా తెలిపింది.

58

తమ అమ్మ పుట్టిన రోజు మాల్దీవుల్లో సెలబ్రేట్‌ చేయాలని ప్లాన్‌ చేసింది పూజా. సింపుల్‌గానే బర్త్ డే కేక్‌ కూడా కట్‌ చేయించారు. మరోవైపు తన సోదరుడు రిషబ్‌ హెగ్డేతోనూ ఫోటోని పంచుకుంటూ లెస్‌గుడ్‌ అని పేర్కొంది. 

68

మరోవైపు తన నాన్న ఫోటోని పంచుకుంటూ తనజీవితంలో అత్యంత డ్రామాటిక్‌ పర్సన్‌ అని పేర్కొంది. ఇది బాగా వైరల్‌ అవుతుంది. పూజా ఫాదర్‌ చాలా యంగ్‌గా ఉండటం విశేషం. 

78

ఇంకోవైపు తాను మాల్దీవుల్లో ఉండబోయే హౌజ్‌ పిక్‌ని కూడా పంచుకుంది. వెకేషన్‌ హౌజ్‌ అని పేర్కొంది. ప్రస్తుతం పూజా తన ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్‌ చేసిన ఫోటోలు, వీడియోలో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. 

88

వర్క్ పరంగా `రాధేశ్యామ్‌`, `ఆచార్య` చిత్రాలు విడుదల కానున్నాయి. వీటితోపాటు తెలుగులో మహేష్‌తో త్రివిక్రమ్‌ సినిమా ఇటీవల ప్రారంభమైంది. తమిళంలో `బీస్ట్` రిలీజ్‌కి రెడీ అవుతుంది. ఇంకో వైపు హిందీలో రణ్ వీర్‌ సింగ్‌తో `సర్కస్‌` చిత్రం చేస్తుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories