ఈరోజు ఎపిసోడ్ లో వేద తనలో తానే మాట్లాడుకుంటూ ఈ యాత్రను ఏమంటారు తీర్థయాత్రనా కాదు కాదు ముసలోళ్ళు వెళ్లడం మాదిరి తీర్థయాత్ర ఏమిటి ప్రేమయాత్ర కాదు కాదు అనుకుంటూ ఉంటుంది. అప్పుడు వేద కన్ఫ్యూజన్ గా మాట్లాడుకుంటూ సిగ్గుపడుతూ ఉంటుంది. మరొకవైపు యష్ కూడా సిగ్గుపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు. అలా యష్, వేద ఇద్దరూ సంతోషంగా ఉంటారు. మరొకవైపు మాలిని,సులోచన ఇద్దరూ కలిసి ఎస్ వెళ్లడానికి ఏర్పాటు చేస్తూ తెగ హడావిడి చేస్తూ ఉండగా ఇంతలో సులోచన భర్త మాలిని కి సపోర్ట్ చేయడంతో మాలిని భర్త సులోచనకి సపోర్ట్ చేస్తాడు.