టాలీవుడ్ బడా ఫ్యామిలీస్ లో మంచు కుటుంబం ఒకటి. ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ నటులుగా ఒకప్పటి వైభవం కోల్పోయారు. మోహన్ బాబు(Mohan Babu) విలన్, హీరో, కమెడియన్, క్యారెక్టర్ రోల్స్ తో విలక్షణ నటుడు అనిపించుకున్నాడు. 500లకు పైగా చిత్రాల్లో నటించి రికార్డులు నెలకొల్పాడు. ఆయన లెగసీని ముందుకు తీసుకెళ్లడంలో వారసులు ఫెయిల్ అయ్యారు.