ఎపిసోడ్ ప్రారంభంలో ఈ జర్నీ ని ఇంతటితో ఆపేద్దాం అంటూ షాకిస్తాడు యష్. ఏం మాట్లాడుతున్నారు అంటూ కంగారుగా అడుగుతుంది వేద. రైలు పట్టాల్లా ప్రయాణించడం అనవసరం, లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడటం నాకు రాదు. ఏ రిలేషన్ షిప్ లోనైనా కావాల్సింది నమ్మకం. నమ్మకం లేని రిలేషన్షిప్ వేస్ట్ అంటూ కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు యష్. మరోవైపు సడన్ గా యష్ ఎందుకు ఇలా ప్రవర్తించాడో అర్థం కావట్లేదు అంటాడు రత్నం. ఎక్కడో ఏదో తేడా జరిగింది అంటుంది చిత్ర. అప్పుడే వచ్చిన వసంత్ తో యష్ కనిపించాడా వాడితో మాట్లాడావా ఇంటికి వస్తానన్నాడా అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది మాలిని.