మంచు లక్ష్మి రేర్ అండ్ అన్ సీన్ పిక్స్... మోహన్ బాబు కుమార్తె గురించి ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసా?

Published : Apr 03, 2023, 10:34 AM ISTUpdated : Apr 03, 2023, 10:40 AM IST

నటి మంచు లక్ష్మి తన అరుదైన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పంచుకున్నారు. ఆమె జీవితంలో కీలక ఘట్టాలకు సంబంధించిన ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

PREV
110
మంచు లక్ష్మి రేర్ అండ్ అన్ సీన్ పిక్స్... మోహన్ బాబు కుమార్తె గురించి ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసా?
Manchu Lakshami

విలక్షణ నటుడు మోహన్ బాబు నటవారసురాలైన మంచు లక్ష్మి మల్టీ టాలెంటెడ్. అమెరికాలో టాక్ షోలకు హోస్ట్ గా వ్యవహరించిన ఘనత ఆమె సొంతం. ఆమె నటి, నిర్మాత, వ్యాఖ్యాత, సోషల్ యాక్టివిస్ట్ కూడాను. మంచు లక్ష్మి తన రేర్ పిక్స్ షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.

210
Manchu Lakshami

మంచు లక్ష్మి 1977 అక్టోబర్ 8న చెన్నైలో పుట్టారు. మోహన్ బాబు మొదటి భార్య విద్యాదేవి సంతానమే మంచు లక్ష్మి. విష్ణు తమ్ముడు కాగా, మనోజ్ స్టెప్ బ్రదర్. ఈమె పేరిట శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ స్థాపించి మోహన్ బాబు అనేక హిట్ సినిమాలు తెరకెక్కించారు. 
 

310
Manchu Lakshami

చదువు పూర్తయ్యాక మంచు లక్ష్మి అమెరికాలో కెరీర్ మొదలుపెట్టారు. యాక్టింగ్ లో శిక్షణ తీసుకున్నారు. హాలీవుడ్ చిత్రాల్లో మైనర్ రోల్స్ చేశారు. కొన్ని టెలివిజన్ షోస్ కి హోస్ట్ గా వ్యవహరించారు. 
 

410
Manchu Lakshami

2006లో చెన్నైకి చెందిన ఐటీ ప్రొఫెషనల్ అండీ శ్రీనివాసన్ ని మంచు లక్ష్మి వివాహం చేసుకున్నారు. వీరికి ఒక అమ్మాయి. సరోగసీ పద్దతిలో మంచు లక్ష్మి తల్లి అయ్యారు. 
 

510
Manchu Lakshami

అనగనగా ఓ ధీరుడు మూవీతో నటిగా టాలీవుడ్ లో అడుగుపెట్టారు. శృతి హాసన్-సిద్ధార్థ్ జంటగా నటించిన ఈ ఫిక్షనల్ డ్రామాలో మంచు లక్ష్మి నెగిటివ్ రోల్ చేశారు. 
 

610
Manchu Lakshami

గుండెల్లో గోదారి, దొంగాట, లక్ష్మీ బాంబ్, వైఫ్ ఆఫ్ రామ్ చిత్రాల్లో మంచు లక్ష్మి హీరోయిన్ గా నటించారు. అయితే ఆమెకు బ్రేక్ రాలేదు. పాతిక చిత్రాలకు పైగా నటించారు. విలక్షణ పాత్రలు చేశారు. 
 

710
Manchu Lakshami

ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో అగ్ని నక్షత్రం టైటిల్ తో మూవీ తెరకెక్కుతుంది. త్వరలో ఇది విడుదల కానుంది. ఈ చిత్ర విజయం మీద మంచు లక్ష్మి విశ్వాసంతో ఉన్నారు. 
 

810
Manchu Lakshami


ఇటీవల మంచు ఫ్యామిలీలో ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. మనోజ్ తన ప్రేయసి భూమా మౌనికను రెండో వివాహం చేసుకున్నారు. ఈ పెళ్ళికి విష్ణు దూరంగా ఉన్నారు. లక్ష్మి దగ్గరుండి తమ్ముడు వివాహం జరిపించింది. 
 

910
Manchu Lakshami

విష్ణు మీద ఆరోపణలు చేస్తూ మనోజ్ ఓ వీడియో విడుదల చేశారు. ఇది అత్యంత వివాదాస్పదమైంది. మంచు బ్రదర్స్ మధ్య గొడవలు రచ్చకెక్కాయని వార్తలు వచ్చాయి. మంచు లక్ష్మి దీనిపై వివరణ ఇచ్చారు. ఇది కేవలం చిన్న గొడవ. రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదన్నారు. 
 

1010
Manchu Lakshami


నటి మంచు లక్ష్మి తన అరుదైన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పంచుకున్నారు. ఆమె జీవితంలో అరుదైన ఘట్టాలకు సంబంధించిన ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 
 

click me!

Recommended Stories