నేను నువ్వు అనుకున్నట్టుగానే ఉన్నానా అనడంతో అవును అని సిగ్గుపడుతూ దానికి మించి ఉన్నారండి అని అంటుంది. నాకు కూడా ఈరోజు చాలా హ్యాపీగా ఉంది వేద. ఎందుకంటే ఈరోజు నువ్వు నేను అని చెబుతూ ఉండగా వేద సిగ్గుపడుతూ ఉంటుంది. నువ్వు కోరుకున్నట్లుగానే నటించాను కదా అనడంతో రాజా రాణి, వేద ముగ్గురు షాక్ అవుతారు. అప్పుడు వేద యష్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఇప్పుడు నీకు సంతోషంగానే ఉంది కదా, ఈ సంతోషం చూసి నాకు కూడా హ్యాపీగానే ఉంది. అప్పుడు రాజారాణి ఇద్దరు ఆశ్చర్యపోతారు. మొదటిసారిగా నటిస్తున్నాను చేయగలనా లేదా అనుకున్నాను బాగానే నటించాను అని అనడంతో వేద ఎమోషనల్ అవుతూ ఉంటుంది.