Ennenno Janmala Bandham: యష్ కు కోవిడ్ అంటూ షాక్ ఇచ్చిన వేద.. తండ్రి ప్రేమను సొంతం చేసుకున్న ఖుషి!

Published : Apr 14, 2022, 12:44 PM IST

Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం (Ennenno Janmala Bandham) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మంచి కుటుంబం నేపథ్యంలో కొనసాగుతూ ఎంటర్టైన్మెంట్ సీరియల్ గా బాగా దూసుకెళ్తుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.  

PREV
17
Ennenno Janmala Bandham: యష్ కు కోవిడ్ అంటూ షాక్ ఇచ్చిన వేద.. తండ్రి ప్రేమను సొంతం చేసుకున్న ఖుషి!

యష్ (Yash) తలను దువ్వుకుంటూ ఉండగా ఆయన వెంట్రుకలు ఎలాగైనా సంపాదించుకోవాలి అని వేద (Vedha) తాపత్రయం పడుతుంది. అంతే కాకుండా యష్ తో బాగా క్లోజ్ గా మాట్లాడుతుంది. దాంతో యష్.. తను ఏంటి ఇలా ప్రవర్తిస్తుంది అని అనుకుంటాడు.
 

27

ఇక మొత్తానికి దువ్వెనకు యష్ (Yash) వెంట్రుకలు ఉండటంతో వాటిని తీసుకోవాలనుకుంటోంది. ఆ సమయంలో యష్ ఫోన్ మర్చిపోవడం తో వేద (Vedha) ఫోన్ ఇచ్చి తిరిగి వెంట్రుకలు తీసుకోవడానికి వస్తుంది. అప్పటికే మాళిని ఆ వెంట్రుకలు తీసుకొని బయట పడేయటానికి వెళుతుంది.
 

37

దాంతో వేద కాస్త నిరాశ పడుతుంది. మరోవైపు అభిమన్యు (Abhimanyu) వేద పై కోపంతో రగిలిపోతాడు. ఇప్పటి వరకూ తనను ఏ ఆడది ఎదిరించలేదని అలాంటిది వేద ఎదిరించింది అని ఎలాగైనా వేద పని చేయాలి అని క్రూరంగా ఆలోచిస్తాడు. పక్కనే ఉన్నా మాళవిక (Malavika) కూడా వేద పై మరింత కోపాన్ని చూపిస్తుంది.
 

47

బ్లడ్ శాంపిల్ కోసం ఎలాగైనా యష్ (Yash) బ్లడ్ ను సంపాదించుకోవడం కోసం వేద (Vedha) యష్ కు కరోనా వచ్చింది అంటూ ఒక గేమ్ క్రియేట్ చేసి బాగా హడావిడి చేస్తోంది. ఇక దానిని అవకాశం గా తీసుకొని బ్లడ్ శాంపిల్ సొంతం చేసుకుంటుంది.
 

57

ఖుషి (Khushi) వెంట్రుకలను, యష్ బ్లడ్ శాంపిల్ ను డాక్టర్ కి ఇచ్చి డీఎన్ఏ టెస్ట్ చేయించమని చెబుతుంది. మరోవైపు సులోచన (Sulochana) దంపతులు, మాళవిక దంపతులు యష్, వేదల గురించి ఆలోచిస్తూ ఉంటారు. తమ జీవితాలు ఎలా ఉన్నాయో అర్థం కావటం లేదు అని అందరూ ఒక దగ్గరికి వచ్చి చర్చ చేసుకుంటారు.
 

67

ఆ సమయంలో సీతారాముల కళ్యాణం గురించి ఆలోచన రావడంతో వేద (Vedha), యష్ (Yash) లను పూజలో పాల్గొనేటట్లు చేస్తే వారి జీవితం బాగుంటుంది అని అనుకుంటారు. దాంతో అనుకున్నట్టుగానే వేద, యష్ శ్రీరామనవమి వేడుకలో పాల్గొంటారు. 
 

77

తరువాయి భాగం లో వేద (Vedha) డీఎన్ఎ రిపోర్టులు తీసుకువచ్చి ఖుషి నీ కూతురు అంటూ యష్ కు చెప్పటంతో చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు. అంతేకాకుండా ఖుషిని (Khushi) ప్రేమగా దగ్గరకు తీసుకుంటాడు.

click me!

Recommended Stories