మరొకవైపు యష్ ఇంట్లో మాలిని భర్త సులోచన భర్త ఇద్దరూ ముగ్గుల పోటీకి అన్ని సిద్ధమయ్యాయి ఇప్పుడు జడ్జ్ ఎవరు అన్నది నిర్ణయించాలి అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు మాలిని, సులోచన ఇద్దరు జడ్జి విషయంలో ఫన్నీగా పోట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు రత్నం మనలో మనకు తెలిసిన వాళ్ళు కాకుండా కొత్త పర్సన్ ని రప్పిద్దాం అని అనడంతో సరే అని అందరూ మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడు మాలిని సులోచన ఇద్దరూ రంగులో పోటీలో గెలిచేది నేను అంటే నేను అని మళ్ళీ పోట్లాడుకుంటూ ఉంటారు. మరొకవైపు వేద, విన్నీకి ఏమైంది నార్మల్ గా ఇంత లేట్ చేయడు కదా అనుకుంటూ ఉండగ ఇంతలోనే విన్నీ అక్కడికి వచ్చి హలో పండిత రాజుల వేదస్విని అనడంతో వేద సంతోషపడుతూ విన్నీ వైపు చూస్తుంది.