అప్పుడు వాళ్లు కార్లు వెళ్తుండగా రిషి నువ్వు ఇంట్లో వాళ్ళు చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకో లైఫ్ లో ఎవరిని నమ్మొద్దు అని వైపు చూసి అంటాడు రిషి. అప్పుడు వసుధార రాజ్ సార్ నచ్చినవాళ్లు అందరికీ దొరకరు అనగా దొరికిన వాళ్ళు మోసం చేసి వెళ్ళిపోతారు అంటారు. రిషి. అప్పుడు సరే ఈ టాపిక్ ఇంతటితో వదిలేయ్ రాజ్ అని అంటాడు. మరొకవైపు జగతి, మహేంద్ర ఇద్దరూ ఒకచోట నిలబడి ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు మహేంద్ర, జగతి ఈ కాలేజీలో ఎక్కడ చూసినా కూడా వసుధార, రిషి ఇద్దరు కలిసి తిరిగారు అని అంటుండగా అవన్నీ ఇప్పుడు ఎందుకు గుర్తు చేస్తున్నావు మహేంద్ర. వారిద్దరు కలిసి తిరిగారు కానీ వసుధర ఇలా చేసింది అనుకుంటూ ఉంటుంది జగతి.