తమిళ స్టార్ హీరో సరసన కీర్తి సురేష్? AK62లో హీరోయిన్ గా కళావతి ఫైనల్?

First Published | Jan 24, 2023, 12:40 PM IST

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ - విఘ్నేశ్ శివన్ కాంబోలో ఓ చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. అందులో కీర్తి సురేశ్ కూడా ఫైనల్ అయ్యిందంటూ గట్టి బజ్ వినిపిస్తోంది.
 

టాలీవుడ్ హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh) చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీ అవుతోంది. ఇప్పటికే తెలుగు, తమిళ చిత్రాల్లో ఆఫర్లను అందుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరో భారీ చిత్రంలో తమిళ స్టార్ హీరో కు జోడీగా నటించబోతున్నట్టు తెలుస్తోంది.
 

ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరో కాదు.. అజిత్ కుమార్ (Ajith)నే. సంక్రాంతి కానుగా అజిత్ ‘తెగింపు’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తమిళంలో పాటు తెలుగులోనూ విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో అజిత్ మరో ప్రాజెక్ట్ పైనా క్రేజీ అప్డేట్ వినిపిస్తోంది.


తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ ప్రస్తుతం తన 62వ చిత్రంపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి లేడీ సూపర్ స్టార్ నయనతారా భర్త, తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించబోతున్నారు. AK62 వర్క్ టైటిల్ తో రూపుదిద్దుకోనుంది. మైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించబోతున్నారు. 
 

అయితే, ఈ చిత్రంతో అజిత్ కు జోడీగా ఎవరు నటించబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఇందులో ఇద్దరు హీరోయిన్లు నటించబోతున్నారని, అందులో ఐశ్వర్యా  రాయ్ బచ్చన్ ఫైనల్ అయ్యినట్టు తెలుస్తోంది. ఇక మరో హీరోయిన్ గా సాయిపల్లవి, త్రిషల పేర్లు వినిపించాయి. 
 

కానీ, వారిద్దరూ కాదని, AK62లో హీరోయిన్ కీర్తి సురేష్ కే అవకాశం దక్కిందంటూ తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే కీర్తికి మరింత క్రేజ్ దక్కనుందని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇక ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్టు తెలుస్తోంది. వీటిపై ఇంకా అధికారిక ప్రకటన అందాల్సి ఉంది.
 

కీర్తి ప్రస్తుతం తమిళంలో నాలుగు చిత్రాల్లో నటిస్తోంది. ఇటీవల `రివాల్వర్‌ రీటా` ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదలై ఆకట్టుకుంటోంది. దీంతో పాటు ‘మామ్నమ్’,‘సైరెన్’, ‘రఘు తాత’ వంటి చిత్రాల్లో నటిస్తోంది. ఇక మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘భోళా శంకర్’లోనూ కీర్తి చిరుకు చెల్లిగా నటిస్తోంది. ‘దసరా’ షూటింగ్ పూర్తై విడుదలకు సిద్ధం అవుతోంది.

Latest Videos

click me!