Ennenno Janmala Bandham: యష్, వేదల పెళ్లి ఫిక్స్.. ఆలోచనలో పడ్డ అభిమన్యు, మాళవిక!

Navya G   | Asianet News
Published : Feb 02, 2022, 02:44 PM IST

Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం (Ennenno Janmala Bandham) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మంచి కుటుంబ కథ నేపథ్యంలో ఈ సీరియల్ ప్రసారమవుతుంది. ఇక ఈ సీరియల్ రేటింగులో కూడా మొదటి స్థానంలో దూసుకెళ్తుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.  

PREV
15
Ennenno Janmala Bandham: యష్, వేదల పెళ్లి ఫిక్స్.. ఆలోచనలో పడ్డ అభిమన్యు, మాళవిక!

సులోచన (Sulochana), వరదరాజులు (Varadharajulu) వేద సంబంధం కోసం యష్ వాళ్ల ఇంట్లో కి వెళ్ళిన సంగతి తెలిసిందే. ఇక మాలిని సులోచన ఉందని పైగా తాము పెళ్ళికొడుకు వాళ్లమని కాస్త అతిగా ప్రవర్తిస్తుంది. అది చూసిన సులోచన తన మనసులో తిట్టుకోవడం మొదలుపెడుతుంది.
 

25

ఇక మాలిని (Maalini) వచ్చి మర్యాద లేదా అని అడగటంతో సులోచన లేచి నిలబడుతుంది. ఇక మాలిని అలా కాసేపు లేస్తూ, కూర్చుంటూ కాసేపు ఆట పట్టిస్తుంది. సులోచన (Sulochana) పెళ్లి గురించి అడగడంతో మాలిని ఈ పెళ్ళికి నేను ఒప్పుకోను అని షాక్ ఇస్తుంది. దాంతో ఇంట్లో వాళ్ళు అందరూ షాక్ అవుతారు.
 

35

మరోవైపు యష్ (Yash), వేద కారులో ఇంటికి వస్తూ ఉంటారు. ఇక ఖుషి వేద గురించి ఆలోచిస్తూ తనతో గడిపిన క్షణాలను తల్చుకుంటూ ఉంది. ఇక్కడ ఇంట్లో సులోచన, మాలిని (Maalini) మద్య కాసేపు మాటల యుద్ధం జరుగుతోంది. వేద, యష్ తమ ఇంటి దగ్గరికి వచ్చి పెళ్లికి పెద్ద వాళ్ళను ఒప్పించి చేసుకోవాలని అనుకుంటారు.
 

45

ఇంట్లో పెద్ద గొడవ జరగడంతో అక్కడికి వెళ్లి చూసేవారికి ఇరువురి కుటుంబాల మధ్య బాగా గొడవ జరుగుతుంది. మధ్యలో యష్ (Yash), వేద వెళ్లి గొడవను ఆపుతారు. ఇది మీ వల్లే జరిగింది అంటూ ఒకరికొకరు అనుకుంటారు. తర్వాత యష్, వేద (Vedha) లపై పువ్వులు చల్లుతూ పెళ్లికి ఒప్పుకున్నాము అని అంటారు.
 

55

పెళ్లిచూపులు ఏర్పాట్లు చేయగా అక్కడ కాసేపు సరదాగా అనిపిస్తుంది. ఒకరికొకరు మొత్తానికి సంబంధాన్ని కుదుర్చుకుంటారు. ఇక ఏ పద్ధతిలో పెళ్లి జరగాలి అని చీటీలు వేసి మరి రచ్చ రచ్చ చేస్తారు. ఇక వసంత్ (Vasanth), చిత్ర (Chitra) తమ లైన్ క్లియర్ అయింది అన్నట్లుగా తెగ సంతోష పడతారు.

click me!

Recommended Stories