బాలీవుడ్ లో వింత ఆచారం.. విడాకులు తీసుకుని కూడా చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్న స్టార్ జంటలు..

Published : Feb 02, 2022, 01:57 PM ISTUpdated : Feb 02, 2022, 01:59 PM IST

బాలీవుడ్ లో వింత ఆచారం నడుస్తోంది. మేం కలిసి ఉండలేం అని విడాకులు తీసుకున్న పిల్మ్ స్టార్ సెలబ్రిటీస్.. చెట్టా పట్టాలు వేసుకుని తిరుగుతున్నారు. ఇందేంటని అడిగితే.. రకరకాల కారణాలు చెపుతున్నారు స్టార్స్.. మరి బాలీవుడ్ లో ఇలా తిరుగుతున్న స్టార్స్ ఎవరు..?

PREV
15
బాలీవుడ్ లో వింత ఆచారం.. విడాకులు తీసుకుని కూడా చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్న స్టార్ జంటలు..

ఒక్కసారి విడాకులు తీసుకున్నాస్టార్స్ కాని సామాన్యులు కాని కలవడాలు ఉండవు .. ఒక వేళ కలిసినా  పెద్దగా ఇంటరాక్షన్ ఉండదు . కానీ సినిమా వాళ్ల డివోర్స్ మాత్రం డిఫరెంట్ . ఏళ్లుగా కలిసుండి ఇక మా దారులు వేరంటూ డివోర్స్ తీసుకుని మళ్లీ కలిసి షికార్లకు, పార్టీలకు అటెండ్ అవుతూ ఉంటారు. ఈమధ్య బాలీవుడ్ లో ఇలాంటి డివోర్స్ జంటలు హాట్ టాపిక్ అవుతున్నాయి.

25

బాలీవుడ్ స్టార్ కపుల్..ఎంతో ప్రేమించుకుని ..పెళ్లి చేసుకుని .. సంవత్సరాలు సంవత్సరాలు కలిసుండి.. సడెన్ గా విడిపోతున్నారు. సరే  డివోర్స్ తీసుకున్నా.. ఇక విడిగా ఉంటారు అనుకుంటే .. మళ్లీ పార్టీలకు , పుట్టినరోజులకు కలుస్తూ.. జనాన్ని కన్ ఫ్యూజ్ చేస్తున్నారు. బాలీవుడ్ బ్రేకప్ .. హృతిక్ రోషన్ , సుజానే జంటది. దాదాపు 15 ఏళ్ల మ్యారీడ్ లైఫ్ కి ఎండ్ కార్డ్ చెప్పి ఎవరి దారి వారు చూసుకున్నారు ఈ జంట, అయితే పిల్లల కోసం ఎప్పుడూ కలుస్తూనే ఉన్నారు. అంతేకాదు ..విడాకుల తర్వాత.. లాస్ట్ ఇయర్ కోవిడ్ టైమ్ లో సుజానే..హృతిక్ ఇంట్లోనే ఉండి పిల్లలతో టైమ్ స్పెండ్ చేసింది. అంతే కాదు..ఈ మధ్య హృతిక్ బర్త్ డే కి కూడా సోషల్ మీడియాలో బెస్ట్ డాడ్ ఎవర్ ..బిగ్ హగ్ అంటూ .. వీడియో పోస్ట్ చేసింది.

35

లేటెస్ట్ గా సుస్మితా సేన్ .. తన బాయ్ ఫ్రెండ్ రోహ్మన్ షా తో దాదాపు 4,5 ఏళ్ల నుంచి రిలేషన్ లో   ఒకే ఇంట్లో కలిసుంటున్నారు. అయతే సడెన్ గా ఓ రోజు మేం విడిపోతున్నాం. కానీ ఫ్రెండ్స్ గా  ఎప్పటికీ కలిసుంటాం అంటూ సోషల్ మీడయాలో పోస్ట్ పెట్టారు. ఈ షాక్ నుంచి తేరుకునే లోపే ..రీసెంట్ గా ఈ ఇద్దరు కలిసి కార్ లో బయటికెళ్లారు. అంతేకాదు .. రోహ్మన్ సుస్మతా ఇంటికి వెళ్లి అక్కడ అందరితో టైమ్ స్పెండ్ చేసి బాయ్ చెప్పి మరీ వెళ్లాడు.

45

అసలు వీళ్లు నిజంగానే విడాకులు  తీసుకున్నారా అని జనానికి డౌట్స్ క్రియేట్ చేసే జంట అమీర్ ఖాన్,కిరణ్ రావ్ . ఆల్రెడీ ఓ సారి డివోర్స్ తీసుకుని కిరణ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న అమీర్ ఖాన్ .. 15  ఏళ్ల తర్వాత ఈ మధ్యే విడాకులు తీసుకున్నారు. మా దారులు వేరు..అయినా సరే మేం ఎప్పటికీ స్నేహితులు గానీ ఉంటాం అంటూ డివోర్స్ తీసుకన్నారు. షూటింగ్స్ లో  డాన్సులు చేస్తూ.. కలిసి షూటింగ్స్ లో సందడి చేస్తూ.. పిల్లల పుట్టినరోజులు కలిసి చేస్తూ.. ఫాన్స్ కి షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారు. అంతే కాదు డివోర్స్ అయిన రెండోరోజే కలసి లైవ్ లో ప్రోగ్రామ్ చేసి మేం చాలా హ్యపీగా ఉన్నాం అంటూ ఫాన్స్ తో వీడియో  షేర్ చేసుకున్నారు.

55

ఈ ఫ్రెండ్లీ డివోర్స్ లిస్ట్ లోకే వస్తారు మలైకాఅరోరా, ఆర్బాజ్ ఖాన్ . ఈజంట ఏకంగా 20 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకున్నారు. ఆర్బాజ్ జార్జియా ఆండ్రియానీతో రిలేషన్ లో ఉంటే ,, మలైకా ...యంగ్ హీరో అర్జున్ కపూర్ తో రిలేషన్ లో ఉంది. త్వరలో వీళ్ల పెళ్లి కూడా జరగబోతోందంటూ న్యూస్ నడుస్తోంది. ఇలా సెపరేట్ గా ఎవరి లైఫ్ లో వాళ్లు బిజీగా ఉన్న మలైకా, ఆర్బాజ్ ,..కొడుకు అర్హాన్ కోసం కలుస్తుంటారు. మలైకా, అర్హాన్, ఆర్బాజ్ ఇలా ముగ్గురూ కలిసి టైమ్ స్పెండ్ చేస్తూ.. జనానికి సర్ ప్రైజ్ ఇస్తూ ఉంటారు.

click me!

Recommended Stories