వాళ్ళిద్దర్నీ చూసిన వేద మౌనంగా ఉండిపోతుంది. ఆ తర్వాత సీన్లో అభిమన్యు తన కంపెనీలో కూర్చుని మాళవికకి ఫోన్ చేస్తాడు. మాళవిక ఫోన్ ఎత్తకపోవడంతో, మాజీ భర్తతో సమయం బాగా కడుపుతున్నట్టు ఉన్నది బంగారం నాకు తన పద్ధతి నచ్చడం లేదు, తన యాటిట్యూడ్ నచ్చడం లేదు, తన బిహేవియర్ నచ్చడం లేదు అని అనుకుంటాడు. ఇంతలో కైలాష్ అక్కడికి వచ్చి నాకు సిస్టర్ పద్ధతి ఏమి నచ్చడం లేదు. మీ ఉప్పు తిన్నాను, మీతోనే మందు తాగాను, కానీ మీకే సలహా ఇస్తాను అని అనుకోలేదు. మీ వల్లే సిస్టర్ వేలకి వేలు పెట్టు బట్టలు కొనుక్కుంటూ అన్ని పార్టీలకు వెళ్తుంది.