Guppedantha Manasu: రిషి గురించి బాధపడుతున్న జగతి, మహేంద్రలు.. రిషికి గిఫ్ట్ ఇచ్చిన వసుధార..

Published : Oct 12, 2022, 09:12 AM IST

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు అక్టోబర్ 12వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.  

PREV
18
Guppedantha Manasu: రిషి గురించి బాధపడుతున్న జగతి, మహేంద్రలు.. రిషికి గిఫ్ట్ ఇచ్చిన వసుధార..

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే..రిషి జగతితో, మీరు ఇక్కడికి వచ్చాక డాడ్ ఆనందంగా ఉన్నారు దయచేసి డాడ్ ఆనందాన్ని దూరం చేయొద్దు అని అంటాడు. ఇంతలో మహేంద్ర అక్కడ ఉండడం రిషి,జగతిలు గమనిస్తారు. రిషి మాటలు విన్న మహేంద్ర బాధపడుతూ ఉంటాడు. అప్పుడు రిషి జగతితో, అబద్ధం చెప్తే ప్రతిక్షణం దాన్ని కాపాడుతూ ఉండాలి నిజం చెప్తే అదే మనల్ని కాపాడుతుంది.నేను ఇప్పుడు మీకు చెప్పిన విషయాలన్నీ నిజాలే, ఏ అబద్ధం కూడా లేదు ఇంక మీ ఇష్టం, డాడ్ జాగ్రత్త అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.అప్పుడు మహేంద్ర జగతి దగ్గరికి వస్తాడు.అప్పుడు జగతి, రిషి కఠినంగా మాట్లాడినా రిషి మనసు విప్పి మాట్లాడాడు. తన బాధ ఏంటో నాకు చెప్పాడు ఇంక మనమే దాని గురించి ఆలోచించాలి మహేంద్ర అని అంటుంది జగతి. ఆ తర్వాత సీన్లో వసు ఆటోలో రిషి ఇంటికి వస్తూ, ఈరోజు రిషి సార్ కి గిఫ్ట్ ఎలాగైనా ఇవ్వాలి, సార్ కి ఫోన్ చేద్దామా అని అనుకోని, నేను ఇన్నిసార్లు రిషి సార్ గురించి ఆలోచిస్తున్నాను, 

28

సార్ కూడా నా గురించి అన్ని సార్లు ఆలోచించి ఉంటారా? ఎంతైనా ఈ అబ్బాయిలకి అమ్మాయిల మీద ప్రేమ తక్కువే అని అనుకుంటుంది. ఇంతలో రిషి ఇల్లు వస్తుంది. ఆటో దిగి రిషికి ఫోన్ చేద్దాం అనేసరికి రిషి థాంక్యూ అని మెసేజ్ పెడతాడు.థాంక్యూ ఎందుకు పెట్టారు అబ్బా అని తలదించి ఫోన్లో మెసేజ్ చేస్తూ లోపలికి వస్తూ ఉంటుంది వసు. అదే సమయంలో రిషి కూడా ఫోన్లో మెసేజ్ చూసుకుంటూ వస్తాడు. అలా ఇద్దరు గుద్దుకుంటారు. అప్పుడు వసు, రిషి ని ఇంకోసారి గుద్దుతుంది. ఇంకోసారి గుద్దక పోతే కొమ్ములు వస్తాయి సార్ అని అనగా, నువ్వు ఇలాంటివి బాగా నమ్ముతావు కదా అని రిషి అంటాడు. అప్పుడు వసు, ఇలాంటివి బాగుంటాయి సార్ అని అనగా రిషి కావాలని బుద్ధి అయ్యో అనుకోకుండా తగిలింది అని అంటాడు. అప్పుడు వసు రిషి తో, థాంక్స్ అని ఎందుకు చెప్పారు సార్ అని అనగా, ఈ విషయం మీదే కాదు వస్తారా నేను చాలా విషయాల్లో నీకు థాంక్స్ చెప్పాలనుకున్నాను అని అంటాడు.

38

 అది సరే కానీ ఈరోజు నుంచి దింపడాలు, తీసుకురాడాల ఉండకూడదు అంటే ఏం చేయాలి అని రిషి అనగా, అయితే మీరు నా దగ్గర ఉండాలి,లేకపోతే నేను మీ దగ్గర ఉండాలి సార్ అని వసు అంటుంది. అప్పుడు రిషి, మొత్తానికి మనిద్దరం ఒకే దగ్గర ఉండాలి అది ఎప్పుడు అనేది నువ్వే నిర్ణయించుకో అని అంటాడు. అదే సమయంలో వెనకన దేవయాని వస్తుంది. దేవయానిని చూసిన రిషి, నాకు చిన్న పని ఉన్నది అని చెప్పి అటువైపు నుంచి వెళ్ళిపోతాడు. వెళ్తూ వెళ్తూ చూసి నవ్వుతూ వెళ్తాడు.వసుధార తిరిగి లోపలికి వెళ్తున్నప్పుడు దేవయాని వసుధారని ఆపి ఇక్కడ ఏం చేస్తున్నావు?రిషి నిన్ను ఎందుకు వచ్చాడు అని అడిగాడా? అని అడగగా, లేదు మేడం ఎందుకు లేటుగా వచ్చాను అని తిట్టారు.సార్ కోపం గురించి తెలిసిందే కదా అందుకే ఇంకెప్పుడూ లేటుగా రాను సార్ అని చెప్పే సమయానికి మీరు వచ్చారు అని అంటుంది.

48

దానికి దేవయాని, నాకు అలా అనిపించలేదు అని అనగా, మీరు అనుకున్నది అవ్వనప్పుడు మీకు అలా ఎందుకు అనిపిస్తుంది మేడం అని వసు ఎటకారంగా అంటుంది. అప్పుడు దేవయాని ముఖం కోపంగా పెడుతుంది.దానికి వసు, ఇంకా ఏమైనా అడగాల్సిన ఉన్నాయా మేడం అని అనగా,చాలా ఎక్కువ చేస్తున్నావ్  అని దేవయాని అంటుంది.మా ఫ్రెండ్స్ కూడా అదే అంటారు మేడం నిజాయితీగా ఉన్నప్పుడు ఎక్కువ చేయాలి మేడం. నెక్స్ట్ టైం నుంచి ఒక పని చేయండి ఒక పేపర్ మీద పది అంకెల వరకు రాసి మీ ప్రశ్నలన్నీ నా దగ్గరికి వచ్చి అడగండి, నేను తీరుస్తాను. ప్రస్తుతానికి లోపలికి వెళ్తాను అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది వసుధార. ఆ తర్వాత సీన్లో రిషి కారులో వెళ్తూ, జగతి మేడంకి నేను చెప్పాల్సిన విషయాలు చెప్పాను. ఇంక వసుధారని ఒప్పించి ఏ ఒప్పందాలు లేకుండా నాకు అప్పగిస్తారు అనుకుంటున్నాను, అయినా నేను ఈ ఒప్పందం గురించే ఎక్కువ ఆలోచించకుండా డాడ్ ఆనందం గురించి కూడా ఆలోచించాలి. 
 

58

డాడ్ ఆనందానికి కారణం జగతి మేడమే అని అనుకుంటాడు. మరోవైపు జగతి మహేంద్రతో, మనం ఇంక వసుధారతో మాట్లాడుదాం మహేంద్ర. రిషి బాధని నేను చూడలేకపోతున్నాను అని అనగా, అయినా ఇదంతా దేవయాని వదిన వల్ల వచ్చింది మన మాటలను చాటుగా విన్నారు. ఇప్పుడు నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి అని అనుకునే సమయానికి వసు అక్కడికి వస్తుంది. అదే సమయంలో గౌతమ్ కూడా అక్కడికి వస్తాడు. అప్పుడు జగతి,మహేంద్రాలు వసదారని లోపలికి తీసుకొని వస్తారు. అప్పుడు వసుధార, ఎలా ఉన్నారు మేడం అని అనగా, శరీరం బానే ఉన్నది వసు కానీ మనసు బాలేదు అని అంటుంది.దానికి వసుధార, నేను ఒక పని చేయబోతున్నాను మేడం మీకొక సర్ప్రైజ్ ఉన్నది అని అనగా, నువ్వు నాకు సర్ప్రైజ్ ఇవ్వదు వసు నాకు భయమేస్తుంది.ఒకప్పుడు రిషి ఏం చేస్తాడని భయంగా ఉండేది ఇప్పుడు నాకు ఆ భయం నీ మీద వేస్తుంది అని అంటుంది. 

68

 దానికి వసుధార, భయపడొద్దు మేడం నేను మీకు సంతోషం కలిగించే పనే చేస్తాను అని అనగా మహేంద్ర, జగతికి సంతోషం అయితే నాకు సంతోషమే కదా అని అంటాడు. అప్పుడు వసు,కానీ నాకు రిషి సర్ పర్మిషన్ కావాలి అని అనగా గౌతమ్, అయితే ఇది జరగని పని అని అంటాడు.దానికి జగతి, అలా ఎందుకు అనుకుంటారు రిషి కూడా అన్ని ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటాడు అని అనగా మహేంద్ర, మన ఇంటికి నిర్ణయం తీసుకోవాల్సింది రిషి కాదు ఇంటి పెద్ద దేవయాని వదిన గారు అని ఎటకారంగా అంటాడు.దానికి గౌతమ్, అయితే పర్మిషన్ చచ్చిన రాదు అని అంటుంది. ఆ తర్వాత సీన్లో వసు, రిషి దగ్గరికి వెళుతుంది.అప్పుడు రిషి, ఏంటి చేతి వెనకాతలేదో దాస్తున్నావు అని అనగా, మీకోసం గిఫ్ట్ తెచ్చాను సార్ అని రాజు రాణిలా బొమ్మలను రిషికి ఇస్తుంది. రిషి దాన్ని తెరిచి చాలా బాగున్నాయి వసుధార అని అనగా,అవును సార్ రాజు మీరు, రాణి మేము ఇద్దరూ ఎప్పుడు పక్కపక్కనే ఉండాలి. 

78

ఏ దాంపరిత్యాలు లేకుండా ఉండాలి అని అనగా రిషి, బొమ్మను చూసి చాలా సంతోషపడతాడు. అప్పుడు వసుధార,సర్ మీరు ఏమి అనుకోకపోతే మీకు ఒక విషయం చెప్పాలి జగతి మేడంకి బొమ్మల కొలువ అంటే చాలా ఇష్టం.అందుకే ఈ ఇంట్లో బొమ్మలకొల్లు పెడదాం అనుకుంటున్నాను మీరు ఏమంటారు అని అనగా,మంచి విషయమే వసుధార, చిన్నప్పటి నుంచి ఎప్పుడూ బొమ్మలకొల్లు జ్ఞాపకాలు నా దగ్గర లేవు అని చెప్పి మనసులో, జగతి మేడం ఆనందపడితే డాడ్ సంతోషంగా ఉంటారు అని అనుకోని, బొమ్మలు కలువు పెడదాము అని రిషి అంటాడు. దానికి వసుధార,మీరు ఒప్పుకుంటారని నేను అసలు అనుకోలేదు సార్ అని అంటుంది.
 

88

 అప్పుడు రిషి, నేను ప్రిన్స్ అంటావు, విలన్ చేసేసావా అని అనగా, లేదు సర్ ఊరికనే అలాగ అన్నాను అని వసు అంటుంది. అప్పుడు రిషి, ఆ బొమ్మలను పక్కనపెట్టి ఈ బొమ్మలు బానే ఉన్నాయి వసుధార, కానీ చిన్న లోటు తెలుస్తుంది.ఒక్కసారి కళ్ళు మూసుకొ అని చెప్పి వసుధార కంటి కాటుకను తీసి, ఈ రాణి కి దిష్టి తగలకుండా రాజు దిష్టి చుక్క పెడుతున్నాడు అని చెప్పి బొమ్మకు దిష్టి చుక్క పెడతాడు రిషి. కళ్ళు మూసుకున్న వసుధార ,కళ్ళు తెరిచి దిష్టి చుక్క నాకు పెట్టలేదా అని అనుకుంటుంది.అప్పుడు రిషి,వాసుధార వైపు చూస్తూ ఉంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!

Recommended Stories