ఈరోజు ఎపిసోడ్ లో మహేంద్ర, ఇలా చేస్తున్నావ్ ఏంటమ్మా ఒకవైపు మర్డర్ కేసు అంటున్నారు నీ మెడలో చూస్తే మంగళ సూత్రం అనగా జగతి రిషి ఇద్దరు కోపగించుకుంటూ నోరు తెరిచి మాట్లాడు అని గట్టిగా అరుస్తారు. అప్పుడు రిషి బాధతో ఒక్కసారి చూడు వసుధార అని కన్నీళ్లు పెట్టుకుంటాడు. అప్పుడు వెంటనే వసుధార ఇది మా ఫ్యామిలీకి సంబంధించిన మ్యాటర్ సార్ ఇక్కడి నుంచి మీరు వెళ్లిపోండి అని ఉంటుంది. మీ ఫ్యామిలీనా నాకేం సంబంధం లేదా అని అనగా చెప్పేది అదే కదా సార్ ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. వసుధార నా భార్య అనడంతో రిషి,జగతి, మహేంద్ర షాక్ అవుతారు.