యాంకర్ సుమ బుల్లితెర కార్యక్రమాలకి.. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి బ్రాండ్ యాంకర్ గా మారిపోయింది. తన సీనియారిటీని అంతా జోడించి సుమ చేసే హంగామా అంతా ఇంతా కాదు. తాజాగా సుమ హోస్ట్ గా మరో షో ప్రారంభం అయింది. సుమ అడ్డా పేరుతో సరికొత్త షోని ప్రారంభించబోతున్నారు. ఈ షో తొలి ఎపిసోడ్ లో యువ హీరో సంతోష్ శోభన్ అతిథిగా కనిపించబోతున్నాడు.