ఆ తర్వాత సీన్లో జగతి తన గదిలో కూర్చొని,గతాన్ని గుర్తుతెచ్చుకుంటూ రిషి తనని పేరు పెట్టి పిలవద్దన్నాడ, కాలేజ్ కి తనకి సంబంధం లేదన్నాడు,దాని తర్వాత, ఇంటికి రానిచ్చాడు, పేరు పెట్టి పిలవని చెప్పాడు. ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటూ, నేను జీవితంలో ఎన్నో చూశాను ఆఖరికి ఇప్పుడు బానే ఉంది అనుకున్నాను ఇంకా ఎన్ని పడాల్సి వస్తుందో అని బాధపడుతుంది. ఇంతలో మహేంద్ర అక్కడికి వచ్చి పెళ్లి రోజు గురించి మాట్లాడుతూ ఉండగా జగతి, మనం పెళ్లి రోజు జరుపుకుంటే మనకి బానే ఉంటుంది.